Amit Shah: భాగ్యలక్ష్మి అమ్మవారి సేవలో అమిత్‌షా.. నేడు హైదరాబాద్‌లో బీజేపీ ‘మహా పాదయాత్ర’
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah)చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- V Santhosh Kumar
- Published on- November 2, 2026 / 03:09 PM IST
Union home minister amit shah visit hyderabad bhagyalakshmi temple and padayatra
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయంలో తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు భాజపా ముఖ్య నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం చార్మినార్ వద్ద ఉన్న ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌షా (Amit Shah)ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా ఐటీసీ కాకతీయ హోటల్‌లో భోజన విరామం ముగించుకుని, సినీ ప్రముఖులు చిరంజీవి, రాంచరణ్‌లతో పాటు మైహోం గ్రూప్ అధినేత రామేశ్వర్‌రావుతో అమిత్‌షా సమావేశం కానున్నారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష నిర్వహించనున్నారు.
Raptadu Incident: రాప్తాడు బాధితురాలికి మంత్రి పరామర్శ.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలింపు!
నిజాం కాలేజ్ వద్ద మహా పాదయాత్ర.. ఢిల్లీ ర్యాలీకి దీటుగా భాజపా వ్యూహం:
ఢిల్లీలో సీఈసీ రాజీనామా, ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన ర్యాలీకి పోటీగా భాజపా ఈ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టింది. సాయంత్రం నిజాం కళాశాల మైదానం వద్ద ఉన్న బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి ప్రారంభమయ్యే భారీ ‘మహా పాదయాత్ర’లో అమిత్‌షా పాల్గొననున్నారు. శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా భారీగా ఏర్పాట్లు చేసిన భాజపా, ఈ యాత్ర ద్వారా ప్రత్యర్థులకు బలమైన రాజకీయ సందేశాన్ని ఇచ్చేందుకు సిద్ధమైంది.
