Liquor and Beer Prices to Rise : మందుబాబులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు

Liquor and Beer Prices to Rise : తెలంగాణ మందు బాబులకు ఇరాన్-అమెరికా యుద్ధం భారీ షాక్ ఇవ్వబోతుంది. త్వరలోనే రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నాయి.

US Iran War Impact on Telangana Liquor and Beer Prices to Rise Due to Global Supply Issues

  • మందుబాబులకి షాకివ్వనున్న యుద్ధం
  • తెలంగాణలో మద్యం, బీర్ల ధరలు పెంపు
  • 15-20 శాతం పెరిగేందుకు అవకాశం

Liquor and Beer Prices to Rise : ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న యుద్ధం ఇప్పటికే ప్రపంచ దేశాల మీద ప్రభావం చూపుతోంది. మన దగ్గర గ్యాస్ సిలిండర్లు, ఇంధనంపై యుద్ధం ప్రభావం అధికంగా ఉంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే త్వరలోనే ఇది మరిన్ని రంగాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ యుద్ధం మందుబాబుల జేబుకు చిల్లు పెట్టబోతోందట. వేసవిలో మద్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పైగా మే నెలలో బీర్ల అమ్మకాలు భారీగా ఉంటాయి. ఈ క్రమంలో త్వరలోనే మద్యం ధరలు, మరీ ముఖ్యంగా బీర్ ధరలు పెరుగుతాయంటున్నారు.

సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మద్యం ధరలను సరిచేస్తారు. ఈ క్రమంలో గతంలో 2023 మే నెలలో మద్యం ధరలను పెంచారు. ఈ నిబంధనల ప్రకారం చూసుకుంటే.. 2025 మే నెలలో మరోసారి మద్యం ధరలను సమీక్షించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. యుద్ధం వల్ల అంతర్జాతీయంగా సహజ వాయువు (నేచురల్ గ్యాస్) సరఫరా వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. దీంతో మద్యం సీసాల ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి.

దీని వల్ల దేశంలోని ప్రధాన గాజు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి 40 శాతం మేర పడిపోయింది. దీంతో ఖాళీ సీసాల ధరలు 20 శాతం పెరిగాయి. పెరిగిన అదనపు ధరలు భరించలేకపోతున్నామని.. వెంటనే మద్యం రేట్లు పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మద్యం ధరలను 12-15 శాతం వరకు పెంచాలని వినతి పత్రం కూడా సమర్పించారు. మద్యం ధరల పెంపుపై సర్కార్ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ఓ కమిటీని నియమించింది. దాని సూచన మేరకు మద్యం పెంపును ఐదు స్లాబులుగా విభజించి అమలు చేసే అవకాశముంది.

  1. బాటిల్ సైజ్ (90 ఎంఎల్/ 180 ఎంఎల్/ 375 ఎంఎల్/ 750 ఎంఎల్),
  2. బ్రాండ్/ ప్రైస్ రేంజ్ స్లాబ్ (లో కాస్ట్ లిక్కర్, మిడ్ రేంజ్, ప్రీమియం బ్రాండ్స్),

ట్యాక్స్ స్లాబ్ స్ట్రక్చర్‌ని ఆధారంగా చేసుకుని ధరల పెంపుపై కసరత్తు జరుగుతోంది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం మే నెలలో కొత్త ధరలను ప్రకటిస్తుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే వేసవిలో బీర్ల వినియోగం అధికంగా ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే క్రితం ఏడాది ప్రభుత్వం బీర్ల ధరలను 15 శాతం పెంచింది. అయితే, ప్రస్తుతం సీసాల కొరతతో పాటు అల్యూమినియం క్యాన్ల ధరలు కూడా పెరిగాయి. దీంతో బీర్ల ధరలను మళ్లీ పెంచాలని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. వేసవిలో బీర్లకు డిమాండ్ 30 శాతం వరకు పెరుగుతున్స నేపథ్యంలో సరఫరా మాత్రం 20 శాతం మేర తగ్గడం మార్కెట్‌లో కొరతకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.