Vijayareddy Reddy Case : విజయారెడ్డి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి.. ఎవరితో సంబంధం పెట్టుకున్నావ్ అంటూ వేధించేవాడు..

Vijayareddy Reddy Case : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు మూడు నెలల క్రితం చర్లపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Vijayareddy Reddy Case

  • విజయారెడ్డి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
  • నా భార్యా బిడ్డలు వాళ్ల వల్లే సూసైడ్ చేసుకున్నారు
  • విజయారెడ్డి తల్లి, అన్నపై భర్త సురేందర్ రెడ్డి ఆరోపణలు
  • మా చెల్లిని నిత్యం అనుమానించేవాడు : విజయారెడ్డి సోదరుడు

Vijayareddy Reddy Case : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు మూడు నెలల క్రితం చర్లపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెగులోకి వస్తున్నాయి. తన భార్యాపిల్లల ఆత్మహత్యకు తన అత్త, బావమరిది, అతని భార్య కారణం అంటూ విజయారెడ్డి భర్త సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి సోమవారం మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు. అంతేకాదు.. తనకు మా అత్త, బావమరిది, అతని భార్య నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరారు.

Also Read : Andhra Pradesh : ఏపీలో దారుణ ఘటన.. తల్లిని ఇంట్లో బంధించి సజీవ దహనం చేసిన కుమారుడు

భర్త సురేందర్ రెడ్డి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ఇది కేవలం ఆత్మహత్య కాదని, ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులు చేసిన మానసిక వేధింపుల వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపించారు. అత్త పుష్పలత, బామ్మర్ది చిరంజీవి, ఆయన భార్య ఆస్తికోసం నిరంతరం ఒత్తిడికి గురిచేయడం వల్లే విజయారెడ్డి మనస్తాపానికి గురై ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. తన భార్యాబిడ్డలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని, ఆస్తి పిశాచాల వేధింపులే వారిని బలితీసుకున్నాయన్నారు. చనిపోవడానికి ముందు ఆ మూడు గంటల సమయంలో ఏం జరిగిందనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందని, బెడ్రూమ్‌లో కాలిన కాగితాలు లభించడం అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పారు.

దుర్ఘటన జరిగిన 25రోజులకే ‘నీవు చనిపోతే ఆస్తి ఎవరి పేరిట రిజిస్ట్రేషన్ చేస్తారు?’ అంటూ అత్త, బావమర్ధి తనను ప్రశ్నించడమే కాకుండా, బెదిరింపులకు దిగారంటూ సురేందర్ రెడ్డి పేర్కొన్నాడు. భార్య చనిపోయాక ఇంట్లోని రూ.1.40 కోట్లు, కిలోన్నర బంగారం, ఆస్తి పత్రాలను తీసుకొని పోయారని, తన ప్రాణాలకు సైతం హాని తలపెట్టే ప్రమాదం ఉందని, ఒకవేళ తనకు ఏమైనా జరిగితే, తన ఆస్తులన్నీ తల్లిదండ్రులకు లేదా సేవా సంస్థలకు (ట్రస్టులకు) చెందాలని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు సురేందర్ రెడ్డిపై విజయారెడ్డి సోదరుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాడు. సురేందర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలేనని, తను మానసికంగా పెట్టే వేధింపులు తట్టుకోలేకనే మా చెల్లెలు తన బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిదంటూ చెప్పాడు. అంతేకాదు.. మా చెల్లెలి కంటే సురేందర్ రెడ్డి దాదాపు 15ఏళ్లు పెద్దవాడు. కానీ, మూడేళ్లు మాత్రమే పెద్దవాడిని అని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. చాలా ఆస్తులున్నాయని, పెళ్లయ్యాక దుబాయ్ తీసుకుపోతానని అబద్దాలు చెప్పి నమ్మించాడు. నా చెల్లెలను ఎప్పుడూ అనుమానించేవాడు. రాత్రి డూటీలకు వెళితే ఎవరితో సంబంధం పెట్టుకున్నావ్ అంటూ సతాయించేవాడు. మా చెల్లెలు సురేందర్ రెడ్డి పేరెత్తితేనే కోప్పడేది అంటూ విజయారెడ్డి సోదరుడు చెప్పాడు.

ఇంటి కోసం చేసిన 30లక్షల అగ్రిమెంట్ డబ్బులు నావే. ఆనయకు చెప్పే బిల్డర్ దగ్గరి నుంచి తీసుకున్నా. ఇప్పుడు మాట మారుస్తున్నాడు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రాణహాని ఉందంటూ సురేందర్ రెడ్డి కొత్త డ్రామా ఆడుతున్నాడని విజయారెడ్డి సోదరుడు పేర్కొన్నారు. సురేందర్ రెడ్డి కాల్ డేటా బయటకు తీయాలని, అప్పుడే అన్ని నిజాలు బయటకు వస్తాయని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు.