Weather Report: తెలంగాణలో తేలికపాటి వర్షాలు
రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
- Narender Thiru
- Published On : May 6, 2022 / 03:00 PM IST
Weather
Weather Report: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం రోజు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.
విదర్భ నుంచి ఉపరితల ద్రోణి.. తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగనుందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది.
