తెలంగాణకు వర్ష సూచన

  • Publish Date - April 27, 2020 / 05:59 AM IST

రాగల మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర జార్ఖండ్‌ నుంచి, ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని…దీని ప్రభావంతో వర్షాలు కురవచ్చని పేర్కొంది. అలాగే శనివారం, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. సోమవారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం శనివారం ప్రకటించింది.

కాగా… గత వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోనూ వర్షం కురవడంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. అయితే వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో పలు ప్రాంతాల్లో పంటలు భారీగా దెబ్బతినే అవకాశం ఉంది.