SIR Explained : ‘సర్’ అంటే ఏంటి? ఎందుకు అవసరం? ఎలా జరుగుతుంది? ఓటర్ల జాబితా ఫుల్ ప్రాసెస్ ఇదే..!

SIR Explained : ప్రత్యేక సమగ్ర సవరణ జూన్ 25 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ ప్రక్రియలో ఓటర్ల జాబితాకు సంబంధించి సమగ్ర సవరణ జాబితాను రెడీ చేయనున్నారు.. పూర్తి ప్రాసెస్ ఎలా కొనసాగుతుందంటే..

SIR Explained

అసలు ఓటర్ల జాబితాలో మీరు ఉందా? ఏమైనా తప్పులు ఉన్నాయా? మీకు పలు చోట్ల ఓటు హక్కు ఉందా? అయితే, ఇప్పుడే చెక్ చేసుకోండి. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రారంభం కానుంది. ఇందులో రాష్ట్రంలోని ఓటర్లకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తారు. ఈ జాబితాలో ఏమైనా తేడాలుంటే సవరిస్తారు. అవసరానికి మించి ఉంటే తొలగిస్తారు..

ప్రత్యేక సమగ్ర సవరణ ఏంటి? :
ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అనేది ఎన్నికల సంఘం చేపట్టే కీలకమైన ప్రాసెస్.. ఓటర్ల జాబితా సరిగా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చేయడమే దీని ఉద్దేశ్యం. అంటే.. నిజంగా ఎవరికైనా ఓటు హక్కు ఉంటే అలాంటి ప్రతి పౌరుడి పేరు ఈ ఓటర్ల జాబితాలో కచ్చితంగా ఉండి తీరాలి. అలాగే మరణించినవారు, వలస వెళ్లినవారు లేదంటే తప్పుగా రిజిస్టర్ అయినవారి పేర్లు ఈ జాబితా నుంచి తొలగించాలి.

ఈ పని ఎందుకు అవసరం అంటే.. రోజురోజుకు చాలామంది ప్రజలు ఏదో ఒక కారణం చేత ఒక ఊరు నుంచి మరో ఊరికి వలస వెళ్తున్నారు. కొందరు ఒకటి కన్నా ఎక్కువ ప్రాంతాల్లో తమ ఓటు హక్కును రిజిస్టర్ చేసుకుంటున్నారు. అలాగే, మరికొందరి పేర్లు మరణం తర్వాత కూడా అలాగే ఓటర్ల జాబితాలో ఉంటున్నాయి.

ఇలా జరిగితే ఎన్నికలపై రానురాను ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటుంది. ఇలాంటి సమస్యలను సరిచేయడానికే SIRను ప్రత్యేకంగా నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఎప్పటినుంచి ప్రారంభమవుతుంది? కాల వ్యవధి ఎంత? ఎన్ని దశల్లో జరుగనుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కాలవ్యవధి :
ఈ సర్ కార్యక్రమం అనేది 25/06/2026 నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే అక్టోబర్ (01/10/2026)న ఫైనల్ ఓటర్ల జాబితా విడుదలతో ముగియనుంది. ఈ మధ్యలో మొత్తం ఓటర్ల జాబితా పూర్తిగా పరిశీలించి సవరిస్తారు.

ఏయే దశల్లో జరుగుతుందంటే? :
ముందుగా అధికారులు రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికీ వెళ్లి (25/06/2026 నుంచి 24/07/2026) ప్రతి ఓటర్ వివరాలు సేకరిస్తారు. ఇదే కీలక దశ అని చెప్పాలి. ఎందుకంటే.. అసలు డేటా ఇక్కడే సరిచేయడం జరుగుతుంది. ఆ తర్వాత 31/07/2026న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు.

Read Also : PF Withdraw : ఇష్టం వచ్చినట్టు పీఎఫ్ విత్ డ్రా చేసేస్తున్నారా?.. మీకు షాకింగ్ న్యూస్.. మీకే తెలియకుండా మీ డబ్బులు..

ఇందులోనే మీ పేరు ఎలా ఉంది.. కానీ ఏదైనా తప్పు ఉంటే చెప్పండి అనే స్థాయి లాంటిది. ఆపై 31/07/2026 నుంచి 30/08/2026 వరకు ప్రజలకు మరో ఛాన్స్ ఉంటుంది. ఓటర్ జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే సరిచేయడం దగ్గర నుంచి కొత్తగా రిజిస్టర్ చేయడం లేదా ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పడం అన్ని ఈ దశలో జరుగుతాయి.

ఇక 31/07/2026 నుంచి 28/09/2026 వరకు ఎన్నికల అధికారులు (EROs) ప్రతి దరఖాస్తును పరిశీలించి నిజమైన సమాచారం ఏంటి అనేది నిర్ణయిస్తారు. అవసరమైతే ఆయా వివరాలపై విచారణ కూడా చేస్తారు. తేడా వస్తే ఆ వివరాలను తొలగించడంతో పాటు వారిపై చర్యలు కూడా తీసుకోవచ్చు.

చివరగా 01/10/2026న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. అంటే ఎన్నికల్లో వాడే అధికారిక ఫైనల్ జాబితా ఇదే అనమాట.. ఫైనల్‌గా చెప్పాలంటే.. SIR అనేది ఓటర్ల జాబితాను కేవలం పేర్ల జాబితానే కాకుండా అసలైన అర్హుల వివరాలతో అందించే సమగ్రంగా అందించే ప్రక్రియగా చెప్పవచ్చు.