Medchal : డేటింగ్ యాప్‌లో పరిచయం.. వాట్సాప్‌లో కాల్.. వీడియోలు పంపి రూ.2.5లక్షలు లాగేసిన యువతి.. మరింత డబ్బులు అడగడంతో..
Medchal Whatsapp Video Call Scam: అందమైన అమ్మాయిలతో ఫోన్లలో మాట్లాడించి.. పురుషులను బుట్టలో వేసుకొని, ఆపైన నగ్నంగా వీడియోలు తీసి రూ. లక్షల్లో గుంజుతున్న యువతుల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
- Harish Thanniru
- Updated on- April 29, 2026 / 04:02 PM IST
Whatsapp Video Call Scam Techie Loses Amount in Telangana
- డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతి
- వాట్సాప్ లో కాల్..
- వీడియోలు పంపి డబ్బులు డిమాండ్
- సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
Medchal Scam: అందమైన అమ్మాయిలతో ఫోన్లలో మాట్లాడించి.. పురుషులను బుట్టలో వేసుకొని, ఆపైన నగ్నంగా వీడియోలు తీసి రూ. లక్షల్లో గుంజుతున్న యువతుల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటన తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది.
Also Read : కడప మాధవి రెడ్డి, పిఠాపురం వర్మకు చంద్రబాబు వార్నింగ్?
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో సాప్ట్‌వేర్ ఉద్యోగి యువతి వలలో చిక్కుకొని లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. డేటింగ్ యాప్‌లో పరిచయమైన శిక్ష అనే యువతితో మాటలు కలిశాయి. వీరిద్దరి మధ్య కాస్త చనువు పెరిగిన తరువాత ఆ యువతి వాట్సాప్‌లో కాల్ చేసింది. తనను కూడా అలాగే చేయాలని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను కోరింది. అందుకు అతను ఒప్పుకోకపోవడంతో బలవంతం చేసింది. యువతి ఒత్తిడి చేయడంతో అతను కూడా కాల్ చేశాడు.
ఆ వీడియో కాల్ తరువాత బాధితుడికి టెలిగ్రామ్‌లో యువతి ఒక లింక్‌ను పంపించింది. అతడు ఆ లింక్ ఓపెన్ చేసి చూడగా.. ఆ లింక్ ద్వారా బాధితుడి కాంటాక్ట్ లిస్ట్ మొత్తాన్ని యువతి సేకరించింది. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను నీ ఫోన్ కాంటాక్ట్ లోని అందరికీ పంపుతానని బెదిరింపులకు దిగింది. దీంతో అతను యువతికి రూ.2.5లక్షలు ఇచ్చాడు. ఆ తరువాత ఆ యువతి ఎక్కువ డబ్బులు అడిగింది. బాధితుడు డబ్బులు ఇవ్వకపోవడంతో కాంటాక్ట్ లిస్టులో కొందరికి బాధితుడు వీడియోలను షేర్ చేసింది. దీంతో యువకుడు మల్కాజ్ గిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి విషయాన్ని తెలియజేశాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ మొదలు పెట్టారు.
