ఆయన చిరకాల కోరికను కేసీఆర్ తీరుస్తారా

  • Publish Date - November 23, 2020 / 11:19 AM IST

Gutha Sukender Reddy dream: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టులు ఒక వెలుగు వెలుగుతున్న రోజుల్లో రాజకీయాల్లో తొలి అడుగులు వేసి అంచెలంచెలుగా ఎదిగారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా ఉన్న ఆయన టీడీపీ, కాంగ్రెస్‌ తరఫున మూడుసార్లు ఎంపీగా గెలిచి గుర్తింపు పొందారు. రాష్ట్ర విభజన తర్వాత 2016లో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. 2019లో టీఆర్ఎస్‌ తరఫున ఎమ్మెల్సీ అయ్యి, మండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినా.. ఆయనలో ఓ అసంతృప్తి మాత్రం మిగిలిపోయిందని అంటున్నారు. కనీసం ఒక్కసారైనా రాష్ట్ర మంత్రి కావాలని ఆశిస్తున్నారని టాక్‌.

మంత్రి కావాలని కల:
చట్టసభల్లో అడుగుపెట్టి మంత్రిగా ఒక్కసారైనా బాధ్యతలు చేపట్టాలని గుత్తా సుఖేందర్ రెడ్డి కల అని అనుచరులు అంటున్నారు. అంతరంగిక చర్చల్లోనూ గుత్తా ఈ విషయం ప్రస్తావిస్తుంటారని టాక్. ప్రస్తుతం మండలి చైర్మన్‌గా ఉన్నందున ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతున్నట్టుగా ఆయన ఫీలవుతున్నారట. అందుకే ఒక్కసారి మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారని చెబుతున్నారు.


https://10tv.in/ap-bjp-targets-tdp-than-ysr-congress-party/
కేబినెట్ లో మార్పులు, అప్పుడు గుత్తాకు చాన్స్:
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో మార్పులుంటాయనే ప్రచారం జరుగుతోంది. అప్పుడు గుత్తా సుఖేందర్‌రెడ్డిక చాన్స్‌ దొరుకుతుందేమోనని ఆశిస్తున్నారు. పెద్దల సభ చైర్మన్‌గా ఏడాది కాలం పూర్తయినా మంత్రి కావాలనే కోరిక తీరలేదన్న వెలితి మాత్రం ఆయనలో ఉందట. మంత్రిగా ఉంటే ప్రజలకు మరింత దగ్గర కావచ్చనే అభిప్రాయంలో ఉన్నారట గుత్తా. మరి ఆయన కలను కేసీఆర్‌ నెరవేరుస్తారో లేదో చూడాలి.

https://www.youtube.com/watch?v=EtirJJLk1jA