గెలిపిస్తే గుమ్మానికి ముగ్గులేస్తడట..

ఆడపడుచుల కోసం గడప గడపకు పసుపు పెయింట్ వేసి గడపపై ముగ్గులు వేస్తానని హామీ

గెలిపిస్తే గుమ్మానికి ముగ్గులేస్తడట..

Painter Ravi Kumar

Updated On : December 16, 2025 / 2:41 PM IST

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో చిత్రి విచిత్రమైన ప్రచారాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిపిస్తే మేం ఇది చేస్తాం.. అది చేస్తాం అని పోటీలో దిగే వారు హామీలు గుప్పిస్తుంటారు. ఈ మధ్య కొందరు కొందరు బాండ్ పేపర్ల మీద కూడా రాసిస్తున్నారు. అయితే, ఇలాంటి వెరైటీ ప్రచారంలో ఇంకో వెరైటీ ప్రచారం ఇది.

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరు మండలం లింగన వాయి గ్రామంలో తమ్ముడు గెలుపు కోసం అన్న వినూత్న ప్రచారం ప్రారంభించాడు. 30 ఏళ్ల నుంచి పెయింటర్ గా అనుభవం ఉన్న అన్న రవికుమార్ రంగంలోకి దిగాడు.

లింగన్నవాయి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా తమ్ముడు సగినాల రాజు, పద్మ లు పోటీ చేస్తున్నారు. తమ్ముడి కోసం ఆరో వార్డులో అభ్యర్థిగా అన్న తమను గెలిపిస్తే ఐదు సంవత్సరాల పాటు ఆడపడుచుల కోసం గడప గడపకు పసుపు పెయింట్ వేసి గడపపై ముగ్గులు వేస్తానని హామీ ఇచ్చాడు.

ఐదు సంవత్సరాల పాటు…ప్రతి సంవత్సరం ప్రతి ఇంటి గడపకు.. పెయింట్ వేసి.. ప్రతి సంవత్సరం మీకు నచ్చిన పండుగ రోజు కానీ.. నూతన గృహప్రవేశం కానీ.. మీ ఇంటిలో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు పెయింట్ ముగ్గులు వేస్తానని వినూత్న రీతిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు