Bhadrachalam Temple : దక్షిణ అయోధ్యకు కొత్త వైభవం.. భద్రాచలం ఆలయ అభివృద్ధికి ముహూర్తం ఖరారు.. అధికారులకు కీలక ఆదేశాలు..

Bhadrachalam Temple : దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సరికొత్త వైభవానికి సిద్ధమవుతోంది. ఆలయ అభివృద్ధి పనులకు జూన్ 27వ తేదీన అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు.

Bhadrachalam Temple

Bhadrachalam Temple : దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సరికొత్త వైభవానికి సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధి పనులకు జూన్ 27వ తేదీన అధికారికంగా శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

Also Read : Telangana Govt : విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. వారందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు..

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భద్రాచలం దేవాలయం అభివృద్ధికి అధికారులు దృష్టిసారించారు. ఈ ఆలయ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ఏకంగా రూ.351 కోట్లను కేటాయించిన విషయం తెలిసిందే. భక్తుల మనోభావాలకు అనుగుణంగా.. ఆగమశాస్త్ర నియమాలను కచ్చితంగా పాటిస్తూ ఈ ఆలయ అభివృద్ధి పనులు జరగనున్నాయి.

భద్రాచలం ఆలయ పూర్వ వైభవానికి, ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం కలగలకుండా, సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రాబోయే రెండు వందల సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు సూచనలు చేశారు.

భద్రాచలం ఆలయం అభివృద్ధి పనులపై గురువారం సచివాలయంలో దేవాదాయ శాఖ, ఆలయ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పునులన్నీ పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా ఈ ప్రాజెక్టును అమలు చేయాలని మంత్రి పేర్కొన్నారు. వచ్చే శ్రీరామనవమి నాటికి ముఖ్యమైన పనులు పూర్తి చేసేలా ప్రాజెక్టును పలు విభాగాలుగా విభజించి, ఒకేసారి పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

ఆలయ సంప్రదాయ నిర్మాణ శైలి, పవిత్రత ఏమాత్రం దెబ్బతినకుండా పనులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాతి నిర్మాణాలకు, సాంప్రదాయ దేవాలయ వాస్తుశిల్పానికి ప్రాధాన్యం ఇవ్వాలని, పునర్నిర్మాణం అనంతరం ఆలయం తన చారిత్రక, ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు.