Jagtial : జగిత్యాలలో మృతదేహం ముందు పూజలు
జగిత్యాల టీఆర్ నగర్ లో శవం ముందు పూజలు కలకలం రేపాయి. మరణించిన వ్యక్తిని బ్రతికిస్తానంటూ ఓ వ్యక్తి పూజలు చేయడం పట్టణంలో సంచలనంగా మారింది. రమేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోగా మంత్రాలతోనే చనిపోయాడని పుల్లయ్య అనే వ్యక్తిని మృతుడి బంధువులు చితకబాదారు. దెబ్బల బాధ భరించలేని పుల్లయ్య రమేష్ ని బ్రతికిస్తానని చెప్పి పూజలు చేశాడు.
- kunduru Vinod
- Published On : August 13, 2021 / 08:11 PM IST
Jagtial
Jagtial : జగిత్యాల టీఆర్ నగర్ లో శవం ముందు పూజలు కలకలం రేపాయి. మరణించిన వ్యక్తిని బ్రతికిస్తానంటూ ఓ వ్యక్తి పూజలు చేయడం పట్టణంలో సంచలనంగా మారింది. రమేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోగా మంత్రాలతోనే చనిపోయాడని పుల్లయ్య అనే వ్యక్తిని మృతుడి బంధువులు చితకబాదారు.
పుల్లయ్య ఇంటిముందు రమేష్ మృతదేహం ఉంచి ఆందోళనకు దిగారు. దీంతో రమేష్ ను తానే బ్రతికిస్తానంటూ ఉదయం నుంచి పుల్లయ్య పూజలు చేస్తున్నాడు. మధ్యాహ్నానికి ఈ వ్యవహారం బయటకు వచ్చింది. విషయం పోలీసులకు తెలియడంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అనంతరం పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. పుల్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మృతుడి బంధువులు ధరూర్ కెనాల్ వద్ద ధర్నాకు దిగారు. పుల్లయ్యను తమకు అప్పచెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీరి ధర్నాతో జగిత్యాల కరీంనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
