Viral Tweet: హాస్టల్ నుంచి ఇంటికొస్తున్న కూతురు.. తండ్రికి పంపిన మెనూ లిస్ట్ చూస్తే షాకవ్వడం ఖాయం
హాస్టల్ నుంచి ఇంటికొస్తున్న కూతురు పంపిన మెనూ చూసి షాకయ్యాడో తండ్రి. ఆమె పంపిన మెనూ వివరాల్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
- Narender Thiru
- Published On : December 15, 2022 / 08:25 PM IST
Viral Tweet: హాస్టల్ లైఫ్ అంటే చాలా మందికి బోరింగ్. కానీ, కొన్ని సందర్భాల్లో హాస్టల్లో ఉండక తప్పని పరిస్థితి. హాస్టల్‌కు సంబంధించి ఎక్కువ మందికి నచ్చని విషయం అక్కడి ఫుడ్. తప్పదు కాబట్టి రోజూ ఆ ఫుడ్ తింటుంటారు. హాస్టల్‌లో ఎక్కువ రోజులు ఉండేవాళ్లు ఇంటికెళ్లినప్పుడు నచ్చిన ఫుడ్ తినాలి అనుకుంటారు.
Public Smoking: పొగ రాయుళ్లకు షాక్ ఇస్తున్న అధికారులు.. తెలంగాణలో ఈ ఏడాది 28 వేల మందికి జరిమానా
సాధారణంగానే ఇంటి ఫుడ్ అంటే అందరికీ ఇష్టం. అలాంటిది హాస్టల్‌లో ఉండొచ్చిన వారికైతే మహా ఇష్టం. అందుకే ఇంటికి రాగానే అమ్మానాన్నకు చెప్పి కావాల్సినవి చేయించుకుంటారు. ఇది చాలా మామూలే. కానీ, ఒక అమ్మాయి కూడా తనకేం కావాలో పేరెంట్స్‌కు ముందుగానే చెప్పింది. ఇంటికొచ్చాక ఆమె ఏమేం తినాలనుకుంటుందో ఒక మెనూ ప్రిపేర్ చేసి పేరెంట్స్‌కు పంపింది. ఆ మెనూ చూసి పేరెంట్స్ కూడా షాకయ్యారు. అంత పెద్దగా ఉంది ఆ లిస్ట్. శ్వేతాంక్ భూషణ్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేసిన మెనూ అది. ఆ లిస్ట్ చూసి నెటిజన్లు కూడా షాకవుతున్నారు. ఐదు నెలల తర్వాత హాస్టల్ నుంచి ఇంటికొస్తున్న కూతురు పంపిన మెనూ అంటూ ఆయన ఆ మెనూ ట్వీట్ చేశాడు.
Mumbai: అదృష్టమంటే అతడిడే.. బస్సు కింద పడ్డా బతికిపోయాడు.. వైరల్ వీడియో
ఆ మెనూలో రెస్టారెంట్లోలాగా పెద్ద లిస్టే ఉంది. కబాబ్స్, టిక్కాస్, బిర్యాని వంటివన్నీ అడిగింది ఆమె. కావాలంటే ఆ లిస్ట్ మీరు చూడండి. ప్రస్తుతం నెటిజన్లు ఆకట్టుకుంటున్న విషయమిది. ఆమె లిస్ట్ ఎంత భారీగా ఉన్నా.. ఎంతైనా హోమ్ ఫుడ్.. హోమ్ ఫుడ్డే కదా అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆమె ఈ నెల 16, శుక్రవారం తన ఇంటికి వెళ్లబోతుందట.
Daughter is coming home on 16th evening after 5 months. Hostel (and hers is a vaishnav one) really makes kids bhukkad-Bhikhari!
??♂️??♂️ pic.twitter.com/JOVRCYWX0Y— Shwetank (@shwetankbhushan) December 11, 2022
