viral video : ఏయ్ బుజ్జీ..డాడీ వచ్చేస్తున్నారు,టీవీ కట్టేసి చదువుకో : పాపకు వార్నింగ్ ఇచ్చిన కుక్క
ఏయ్ బుజ్జీ..డాడీ వచ్చేస్తున్నారు,టీవీ కట్టేసి చదువుకో అంటూ యజమాని రాకను గుర్తించిన పెంపుడు కుక్క ఓ చిన్న పాపకు వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
- nagamani
- Published On : December 20, 2022 / 03:13 PM IST
Baby.. Daddy is coming turn off the tv and study pet dog alerts little girl
viral video : ఏయ్ బుజ్జీ..డాడీ వచ్చేస్తున్నారు,టీవీ కట్టేసి చదువుకో..మీడాడీ చూసారంటే కోప్పడతారు అంటూ అమ్మ అనటం సర్వసాధారణం. కానీ ఓ పెంపుడు కుక్క అచ్చం అమ్మలాగా ఓ పాపను అలెర్ట్ చేసింది. పుస్తకాలు ముందు పెట్టుకుని చదువుకోకుండా టీవీ చూస్తున్న పాపను అలెర్ట్ చేసింది కుక్క.. ఓ ఇంట్లో ఓ పాప టీవీ చూస్తోంది. అక్కడే వారి పెంపుడు కుక్క పడుకుని ఉంది. కుక్కలు నిద్రపోతున్నా చిన్న చప్పుడికి కూడా మేలుకుంటాయి. ఎవరన్నా వస్తే వాటికి ఇట్టే తెలిసిపోతుంది. పైగా ఆ వచ్చేది తన యజమాని అయితే పెంపుడు కుక్కకు తెలియకుండా ఉంటుందా? పుస్తకాలు ముందు పెట్టుకుని చదువుకోకుండా టీవీ చూస్తున్న పాపకు కుక్క డాడీ వచ్చేస్తున్నారు టీవీ కట్టేసి చదువుకో అంటూ సంకేతాలిచ్చింది.
పాప సీరియస్ గా టీవీ చూస్తోంది. అక్కడే పడుకున్న వారి పెంపుడు కుక్కకు ఏదో చిన్నపాటి శబ్దం వచ్చింది. అంతే వెంటనే లేచి నిల్చుంది. చెవులు రిక్కించి విన్నది. ఆ వచ్చేది తన యజమాని అని గుర్తించింది. అంతే వెంటనే భౌ అని అరిచిన ఆ కుక్క..చదువుకోకుండా టీవీ చూస్తున్న పాపను అలెర్ట్ చేసింది. డాడీ వచ్చేస్తున్నారు..టీవీ కట్టేసి చదువుకో అంటూ సంకేతాలిచ్చింది.
కుక్క సైగలతో విషయం అర్థం చేసుకున్న ఆ చిన్నారి.. వెంటనే రిమోట్‌తో టీవీని ఆపేసి.. సోఫా నుంచి లేచి.. కుర్చీలో కూర్చొని.. చదువుతున్నట్లు నటించింది. అంతలోనే ఆ పాప తండ్రి తలుపు తీశాడు. కుక్క ఏమీ ఎరగనట్లుగా అతని దగ్గరకు వెళ్లి తోక ఊపింది. ఇలా పాప..కుక్క తోడుదొంగలుగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వార్నీ భలే కుక్క చిన్నారికి భలే సిగ్నల్స్ ఇచ్చిందే వాళ్ల డాడీ వస్తున్నారని అంటున్నారు. కుక్క పాప కలిసి ఆడిన డ్రామా అంతా అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోని ట్విట్టర్‌లోని @Yoda4ever అకౌంట్‌లో డిసెంబర్ 18, 2022న పోస్ట్ చేశారు. దీన్ని ఇప్పటివరకూ 10 లక్షల మందికిపైగా వీక్షించగా వేలాదిమంది లైక్ చేశారు.
Pawtners in crime..????? pic.twitter.com/1eYFWvDeFY
— ?o̴g̴ (@Yoda4ever) December 18, 2022
