Wedding Day: పెళ్లి రోజునే దంపతులను విడగొట్టిన కేకు.. విడాకుల కోసం కోర్టుకు భార్య

కేకు కోసిన తర్వాత దాన్ని తన ముఖంపై రాయకూడదని భార్య చెప్పింది. తన మాటను గౌరవించాలని..

Cake

Wedding Day – Divorce: పెళ్లి రోజు.. జీవితంలో మర్చిపోలేని రోజు. వెడ్డింగ్‌ డేను చాలా మంది గ్రాండ్‌గా జరుపుకోవాలని అనుకుంటారు. కనీసం షాపింగ్, సినిమా, విహారానికి వెళ్లడం వంటివి చేస్తుంటారు. అదీ చేయలేనివారు కేక్ తెచ్చుకుని కట్ చేసి తిని ముచ్చట తీర్చుకుంటారు. ఆ రోజు ఎంతో హ్యాపీగా గడుపుతారు.

అయితే, ఓ దంపతుల జీవితంలో పెళ్లి రోజే చేదు అనుభవాన్ని మిగిల్చింది. పెళ్లి రోజునే వారు విడిపోయారు. విడాకులకు దరఖాస్తు చేసిన భార్య ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ పోస్ట్ చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం..

పెళ్లి రోజును ఆనందంగా జరుపుకుందామని ఆ దంపతులు అనుకున్నారు. అయితే, భర్తకు భార్య ఓ షరతు పెట్టింది. కేకు కోసిన తర్వాత దాన్ని తన ముఖంపై రాయకూడదని చెప్పింది. తన మాటను గౌరవించాలని, నిబంధనను ఉల్లంఘించకూడదని తెలిపింది. అయినప్పటికీ, భార్య పెట్టిన ఆ ఒకే ఒక్క రూల్ ను బ్రేక్ చేశాడు భర్త.

కేకు కట్ చేశాక భార్య ముఖాన్ని కేకుకేసి కొట్టాడు. భర్త చర్యతో ఆమె షాక్ కు గురైంది. తన మాటను గౌరవించని వాడు తనకు వద్దని అనుకుంది. తదుపరి రోజే విడాకులకు దరఖాస్తు చేసింది. గత ఏడాది క్రిస్మస్ ముందు తమ పెళ్లి జరిగిందని, వచ్చే ఏడాది జనవరి చివరి వారంలోపు తనకు విడాకులు మంజూరు అవుతాయని భార్య తెలిపింది.

తమది ప్రేమ పెళ్లి అని, వివాహం అనంతరం అన్ని బాధ్యతలనూ సమానంగా పంచుకుంటున్నామని పేర్కొంది. తన మాటను గౌరవించని వాడు తనకొద్దని స్పష్టం చేసింది. కాగా, భార్య ముఖంపై భర్త కేక్ తో కొట్టిన ఘటనలు గతంలోనూ అనేకం చోటుచేసుకున్నాయి. తాజా ఘటనతో ఆ పాత వీడియోలను ఇప్పుడు నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

Emergency Alert : ఈ రోజు మీ ఫోన్‌కి ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా? దాని అర్ధం ఏంటో తెలుసా..

ట్రెండింగ్ వార్తలు