MLA Jagga Reddy : అందరి ముందే రాహుల్ గాంధీకి అన్నీ చెబుతా : జగ్గారెడ్డి

ఎవ్వరికి భయపడేది లేదు. నాపై నాలుగేళ్లుగా ఇదే జరుగుతోంది. రాహల్ గాంధీకి అన్ని చెబుతా. అందరి ముందే చెబుతా.

MLA Jagga Reddy

MLA Jagga Reddy : పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతీసారి తనపై లేనిపోని ఆరోపణలు వస్తున్నాయనీ..తాను పార్టీ మారతాననే ప్రచారం జరుగుతోంది అంటూ ఆవేదన వ్యక్తంచేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తాను పార్టీ మారటంలేదు అంటూ స్పష్టంచేశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంలో తాను ఎంతో కష్టపడ్డానని ఏర్పాట్లు చేశానని పార్టీ కోసం తాను ఇంతగా కష్టపడుతుంటే తాను పార్టీ మారుతున్నాననే తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని దానికి తాను తరచు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోందని వాపోయారు జగ్గారెడ్డి.

Mahmood Ali : ఆ విషయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు- మంత్రి మహమూద్ అలీ

ఇది సరైందికాదన్నారు. తాను ఎవ్వరికి భయపడనని ఇటువంటివి పార్టీకి మంచిది కాదన్నారు. పార్టీలో నాపై నాలుగేళ్లుగా తాను పార్టీ మారుతున్నాను అనే తప్పుడు ప్రచారం జరుగుతోందని..పార్టీ కోసం ఎంత చేసినా నన్ను ప్రశ్నిస్తున్నారని నేను వివరణ ఇచ్చుకోవటమే పనిగా మారిపోయింది అంటూ వాపోయారు. ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు రాహుల్‌ గాంధీ పిలిచారని..అందరి ముందే రాహుల్ గాంధీకి అన్ని వివరాలు వివరిస్తానని అన్నారు. పార్టీ ఐక్యంగా ఉందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏమో పార్టీ ఐక్యంగా ఉందో.. చెప్పలేను.. చెప్పేవాడినీ కాదు అన్నారు జగ్గారెడ్డి.

కాంగ్రెస్‌లో నేతలపై ఇటువంటి దుష్ప్రచారాలు చేసే దుస్థితి వచ్చిందని.. కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితులు తాను ఎప్పుడూ చూస్తాననుకోలేదని అన్నారు. కానీ రాష్ట్రంలో జరిగే పరిస్థితులు గురించి రాహుల్ గాంధీకి అన్ని వివరిస్తానని..మీడియాకు చెప్పలేని చాలా విషయాలు ఉన్నాయని అవన్ని రాహుల్ గాంధీకి వివరంగా చెబుతానని తాను ఎవ్వరికి భయపడేది లేదని తేల్చి చెప్పారు జగ్గారెడ్డి. మొత్తానికి తాను పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు.

YS Sharmila : సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్

 

ట్రెండింగ్ వార్తలు