Cute teacher Video
Cute teacher Video: తరగతి గదిలో విద్యార్థులతో కలిసి ఓ టీచర్ డ్యాన్స్ చేసి అలరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు స్మార్ట్ ఫోన్ లో తీశారు. టీచర్ డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తరగతి గదిలో విద్యార్థుల మధ్యన నిల్చొన్న ఆ ఉపాధ్యాయురాలు భోజ్ పురీ పాపులర్ పాట “కా కరిహే భయ్యా కా కరిహే”కు స్టెప్పులు వేశారు.
ఆ టీచర్ పేరు అనుష్క చౌదరి. తరగతి గదిలో పదే పదే డ్యాన్సులు చేస్తూ వీడియోలు తీసుకుంటారు. అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా “కా కరిహే భయ్యా కా కరిహే”కు స్టెప్పులు వేశారు. ఈ వీడియోపై నెటిజన్లు అమితాసక్తి కనబర్చుతున్నారు.
టీచర్ చాలా బాగా డ్యాన్స్ చేసిందని కామెంట్లు చేస్తున్నారు. పిల్లలను ఎప్పుడూ చదువు ఒత్తిడిలోనే ఉంచకుండా అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో ప్రోత్సహించాలని చెబుతున్నారు. ఈ టీచర్ ఆ పనే ఇక్కడ చేశారని అంటున్నారు. పిల్లల కన్నా టీచర్ బాగా డ్యాన్స్ చేశారని కొందరు కామెంట్లు చేశారు.
NRI Husband: ఖర్చు ఎక్కువైందని భార్యను వదిలేసిన ఎన్‌ఆర్ఐ భర్త.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన