×
Ad

Metro Station Woman Dragged : మెట్రో స్టేషన్‌లో షాకింగ్ ఘటన.. యువతిని ఈడ్చుకెళ్లిన రైలు

ముంబై చాకలా మెట్రో స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని మెట్రో రైలు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఆమె గాయపడింది. లోకో పైలట్ నిర్లక్ష్యంతో గౌరీ కుమార్ సాహు అనే యువతి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది.

  • Published On : December 31, 2022 / 10:58 PM IST

Metro Station Woman Dragged : ముంబై చాకలా మెట్రో స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని మెట్రో రైలు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఆమె గాయపడింది. లోకో పైలట్ నిర్లక్ష్యంతో గౌరీ కుమార్ సాహు అనే యువతి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది.

అసలేం జరిగిందంటే.. చాకలా మెట్రో స్టేషన్ ప్లాట్ ఫామ్ పై రైలు దిగుతుండగా.. యువతి డ్రెస్ రైలు ఆటోమేటిక్ డోర్ లో చిక్కుకుంది. ఈ విషయాన్ని పక్కనున్న కోచ్ లో లోకో పైలట్ కు చెప్పేందుకు ప్రయత్నించింది. బయటే ఉన్న ఓ ప్రయాణికుడు సైతం అలర్ట్ చేసేందుకు యత్నించాడు. కానీ, ప్రయోజనం లేకపోయింది. ఇదేమీ పట్టించుకోకుండా లోకో పైలట్ రైలును ముందుకు పోనిచ్చాడు.

Also Read..Shocking Video : షాకింగ్ వీడియో.. పేరెంట్స్ బీ కేర్‌ఫుల్, పిల్లాడు చేసిన పనికి స్కూటీ పైనుంచి ఎగిరిపడ్డ తండ్రి

దీంతో యువతిని రైలు ఈడ్చుకెళ్లింది. రైలుతో పాటే కొంతదూరం పరిగెత్తిన యువతి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. రైల్వే సిబ్బంది ఆమెను అంథేరీలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read.. TTE Electric Shock : బాబోయ్.. రైల్వే స్టేషన్‌లో ఊహించని ప్రమాదం, మాట్లాడుతుండగానే కరెంట్ షాక్.. వీడియో వైరల్

యువతి రైలు దిగుతుండగా.. ఆమె డ్రెస్ డోర్ లో చిక్కుకోవడం, రైలు ఆ యువతిని ఈడ్చుకెళ్లడం.. ఆ తర్వాత ఆమె గాయపడటం.. ఇదంతా స్టేషన్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన తోటి ప్రయాణికులను షాక్ కి గురి చేసింది. కాగా, రైలు ఎక్కే సమయంలో దిగే సమయంలో ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఘటన ఇది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలను రిస్క్ లో వేసుకున్నట్లే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.