Viral Video : ఆస్పత్రిలో బెడ్‌పై భర్త.. పక్కనే భార్య రీల్స్ చేస్తూ డ్యాన్స్.. పొట్టుపొట్టు తిడుతున్న జనం..!
Viral Video : భర్తకు ఆస్పత్రిలో చికిత్స.. పక్కనే భార్య రీల్స్ చేస్తూ సందడి చేస్తున్న వీడియో ఒక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
Viral Hospital Dance Reel
Viral Video : అనారోగ్యంతో భర్త ఆవేదన.. ఆ పరిస్థితి చూస్తే ఏ భార్య అయినా తట్టుకోలేదు.. ఆరోగ్యం బాగు కావాలని కోరుకుంటుంది.. భర్తకు పక్కనే ఉండి అతడికి అవసరమైన అన్ని సపర్యలు చేస్తుంది. కానీ, ఈ వీడియో చూస్తే అలా లేదు.. ఇందులో ఓ భార్య తన భర్త పరిస్థితిని చూసి బాధ లేకుండా లైకుల కోసం రీల్స్ చేయడంపై నెటిజన్లు పొట్టుపొట్టుమని తిడుతున్నారు. భర్త అనారోగ్యంతో బాధపడుతుంటే ఇదేం పని అంటూ తిట్టిపోస్తున్నారు.
రీల్స్ అంటే మరి ఇంత పిచ్చా.. పరిస్థితులకు విరుద్ధంగా మానవత్వాలను మరిచి మరింత ఇంత తెగిస్తారా? అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో భర్త ఆస్పత్రిలో బెడ్ పై అనారోగ్యంతో ఉంటే పక్కనే నిలబడిన భార్య రీల్స్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ఇంటర్నెట్లో పెద్దఎత్తున చర్చకు దారితీసింది.
వైరల్ వీడియోను పరిశీలిస్తే.. :
అందులో ఓ వ్యక్తి ఆస్పత్రి బెడ్‌పై నీరసంగా పడుకుని ఉన్నాడు. అతనికి సెలైన్ బాటిల్ కూడా ఎక్కించారు. వైద్యానికి సంబంధించి పరికరాలు కూడా ఉన్నాయి. అతడి ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో పక్కనే ఉన్న భార్య మాత్రం మొబైల్ కెమెరా ఆన్ చేసి ట్రెండింగ్ పాటకు హావభావాలు చూపిస్తూ డ్యాన్స్ చేయడం కనిపిస్తోంది.
Read Also : Xiaomi 17T Sale : షావోమీ కొత్త 5G ఫోన్‌పై రూ.5,000 డిస్కౌంట్.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో సూపర్ డీల్
ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా ఉండాల్సిన సమయం ఇది.. ఈ టైంలో రీల్స్ అవసరమా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్, లైకుల కోసం ఇంతగా దిగజారుతారా? బంధాల కంటే వ్యూస్, లైకులపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Bas ek aisa saath nibhane wali biwi mil jaaye ♥️ pic.twitter.com/FaHRDNaDtt
— Sachya (@sachya2002) July 10, 2026
వాస్తవానికి, ఈ వీడియో వెనుక అసలు పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ లేదు. ఆ వీడియో కేవలం వినోదం కోసమా? లేక మరేదైనా సందర్భమా అనేది కూడా తెలియదు. అయినప్పటికీ, ఆస్పత్రిలో రోగుల విశ్రాంతి, చికిత్సకు సంబంధించిన ప్రదేశాల్లో ఇలాంటి రీల్స్ చేయడం సరికాదని, గౌరవం, బాధ్యతతో ప్రవర్తించాలని పలువురు సూచిస్తున్నారు.
గతంలో కూడా ప్రముఖ దేవాలయాలు, ప్రమాద స్థలాలు, సున్నితమైన సందర్భాల్లో రీల్స్ చేసిన ఘటనలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద చర్చకు తెరలేపింది.
