Viral Video: సింహాలతో అడుకుంటున్న బాలుడు.. చెయ్యి ఎలా కొరికిందో చూడండి.. వీడియో వైరల్
చిన్నారి బాలుడు అడవికి రాజైన సింహంతో ఆడుకుంటున్నాడు. అయితే, అది పెంపుడు సింహం లెండి. అయినప్పటికీ అది ప్రమాదకరమే. ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు
- Narender Thiru
- Published On : December 12, 2022 / 04:31 PM IST
Viral Video: సింహాలు ఎంత భయంకరమైనవో తెలిసిందే. వాటిని చూస్తేనే చాలా మంది వణుకుతారు. అలాంటిది ఎంత పెంపుడు సింహాలైనా వాటితో ఆడుకోవడమంటే మాటలా? అందులోనూ పిల్లలు సింహాలతో ఆడుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఈ వీడియోలోని బుడతడికి నిజంగా ధైర్యం ఎక్కువే ఉంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక బాలుడు సింహాలతో ఆడుకుంటున్నాడు. అందులో ఒకటి పెద్ద సింహం కాగా, రెండోది చిన్న సింహం. పెద్ద సింహంతో బాలుడు ఆడుకుంటుండగా, అతడి చేతిని కొరికేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. కొందరు బాలుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఉంటే, ఇంకొందరు విమర్శిస్తున్నారు. సింహంతో ఆటలాడటం అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. కావాలంటే మీరూ ఈ వీడియో చూడండి.
