Omelette-Lay's Chips
Omelette-Lay’s Chips: లేస్ చిప్స్ ప్యాకెట్‌లో ఓ వ్యక్తి ఆమ్లెట్ వేశాడు. లేస్ చిప్స్ ప్యాకెట్ ను పట్టుకొచ్చిన అతడు అందులోని చిప్స్ ను బయటకు తీయకుండా అందులోనే నలిపేశాడు. అనంతరం ఆ ప్యాకెట్లోనే.. కోడిగుడ్లు పగులకొట్టి వేశాడు. కారం, ఉప్పు, టమాటా వంటి ఇతర పదార్థాలను ఆ ప్యాకెట్లో కలిపాడు. అనంతరం, ఆ ప్యాకెట్ కింది భాగాన్ని వేడి నీళ్లలో ముంచి పట్టుకున్నాడు.
దీంతో చిప్స్ ఆమ్లెట్ సిద్ధమైపోయింది. ఆ ఆమ్లెట్ ను ప్లేటులో పెట్టి కట్ చేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన కాసేపటికే బాగా వైరల్ అయింది. అయితే, ప్లాస్టిక్ ప్యాకెట్ ను వేడినీళ్లలో ముంచి ఆమ్లెట్ ను తయారు చేయడం సరికాదని చాలా మంది నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ప్లాస్లిక్ లో ఉడికించిన పదార్థాలను తింటే తీవ్ర అనారోగ్యానికి గురవుతామని అంటున్నారు.
చిప్స్ తో పెనంపై ఆమ్లెట్ వేస్తాడని అనుకుంటే, చిప్స్ ప్యాకెట్ లోనే ఆమ్లెట్ వేశాడని కొందరు కామెంట్లు చేశారు. అనేక పదార్థాలతో చాలా మంది రుచికర ఆహారాన్ని తయారు చేస్తుంటారు. అనేక రకాల కాంబినేషన్లతో చేసే వంటకాలు రుచితో పాటు ఆరోగ్యకరమైతేనే తినాలి. లేదంటే అనారోగ్యాలను కొనితెచ్చుకున్న వాళ్లం అవుతాం.
Bangladesh vs India: బంగ్లాదేశ్‌పై 227 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం