అసదుద్దీన్ ఒవైసీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకోలేదా ? అంటూ సినీ నటుడు శివాజీ ప్రశ్నించారు. బీజేపీతో ఒప్పందం లేదా ? నమాజ్ చేస్తారు..నిజం చెప్పాలి..దీనికి సంబంధించిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని శివాజీ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఓట్లు చీల్చేందుకు మాత్రమే బీజేపీ నేతలు పోటీ చేస్తున్నారని, కనీసం డిపాజిట్లు కూడా రావని వారికి తెలుసన్నారు శివాజీ.
ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం ‘నిజం’ పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు శివాజీ. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు..కుట్రలు ఇతరత్రా విషయాలను ఆయన వెల్లడించారు. మోడీ దాష్టీకం.. ఏపీకి శాపం అంటూ మండిపడ్డారు. ఏపీ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నది తెలంగాణా సీఎం కేసీఆర్ కాదు.. ప్రదాని అని ఆరోపించారు శివాజీ. తానెవరి కోసమో పని చేయడం లేదని..రాష్ర్ట ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తున్నానని చెప్పుకొచ్చారు శివాజీ. మరి శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.