అమ్మ దగ్గరకు వెళ్లను.. ఆమె వస్తానంటే ఆపను: అమృత

  • Publish Date - March 9, 2020 / 09:15 AM IST

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గోండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య గురించి కుమార్తె అమృత కీలక వ్యాఖ్యలు చేశారు. మారుతీరావు అంత్యక్రియలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె ‘మారుతీరావు కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని వెల్లడించారు.

మారుతీరావును శ్రవణ్‌ కొట్టినట్లు తెలిసిందని, ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో నేను చెప్పలేనని అన్నారు అమృత. మనిషిని చంపించేంత ధైర్యం ఉన్న వాళ్లు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వారు కాదని అన్నారు అమృత. ప్రణయ్‌ హత్యకు ముందు మారుతీరావు ఆస్తులు పంచుకోలేదని, నేను బయటికొచ్చాక ఆస్తులు పంచుకున్నారని అన్నారు.

తన తండ్రికి కోర్టు ద్వారా తప్పుకు శిక్ష పడాలని కోరుకున్నాను అని, కానీ చనిపోవాలని మాత్రం కోరుకోలేదని అన్నారు. భర్త చనిపోతే భార్య పడే బాధలు తనకు తెలుసునని, నా తల్లి దగ్గరకి మాత్రం వెళ్లి ఉండలేనని ఆమె అన్నారు. నా దగ్గరికి వచ్చి ఉంటా అంటే మాత్రం అభ్యంతరం లేదని చెప్పారు. ప్రణయ్ చనిపోయినప్పుడే బలంగా ఉన్నా.. ఇప్పుడు ఎందుకు ఉండలేను అని అన్నారు. (మారుతీరావు ఆత్మహత్యపై అమృత సంచలన వ్యాఖ్యలు..ఆస్తుల కోసం తమ్ముడి ద్రోహం)