తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళంలో భారీ వర్షాలు

ఫోని తుఫాన్ శ్రీకాకుళం జిల్లాపై ప్రభావం చూపిస్తోంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. భారీగా గాలులు వీస్తున్నాయి.

  • Publish Date - May 2, 2019 / 06:15 AM IST

ఫోని తుఫాన్ శ్రీకాకుళం జిల్లాపై ప్రభావం చూపిస్తోంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. భారీగా గాలులు వీస్తున్నాయి.

ఫోని తుఫాన్ శ్రీకాకుళం జిల్లాపై ప్రభావం చూపిస్తోంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. భారీగా గాలులు వీస్తున్నాయి. పొడుగుపాడు గ్రామంలో భారీగా వర్షం పడుతోంది. జనజీవనం స్తంభించింది. తీర ప్రాంత వాసులు, ఏజెన్సీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. తుఫాన్ ఈ జిల్లాపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. 
Also Read : ‘ఫోని’ తుఫాన్ : పూరి భక్తులను తరలించేందుకు స్పెషల్ ట్రైన్

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఫోని పెను తుఫాన్‌గా కొనసాగుతోంది. 2019, మే 02వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు విశాఖపట్నంకు 225 కిలో మీటర్లు, పూరీకి 430 కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మే 03వ తేదీ గోపాల్ పూర్ – చాంద్ బలి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తీర ప్రాంతాల్లో వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.

భీమునిపట్నం, కళింగపట్నంకు 10 నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్టణం, గంగవరం, కాకినాడ పోర్టులకు 8 నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. చాలా ప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చింది. అలలు కూడా 3 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. బీచ్‌ల వద్ద సెక్యూరిటీ పెంచారు. సముద్రంలోకి ఎవరినీ వెళ్లనీయటం లేదు. 
Also Read : ఫోని తుఫాన్ : ఉత్తరాంధ్రలో ముందుకొచ్చిన సముద్రం