కోడి కత్తి పార్టీ నేత అవసరమా : జగన్ పై బాబు ఫైర్

  • Publish Date - March 30, 2019 / 11:20 AM IST

ఇచ్చాపురం : కోడి కత్తి పార్టీ అధినేతకు ప్రజాసమస్యలు పట్టవని,  గత 5 ఏళ్లలో 24 సార్లు అసెంబ్లీకి వస్తే , 248 సార్లు కోర్టుకు వెళ్లాడని జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.  శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురంలో జరిగిన తెలుగు దేశం పార్టీ ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ  ప్రజల సమస్యలు తీర్చటానికి ఇంటికి పెద్ద కొడుకులా నేనుంటానని హామీ ఇచ్చారు.  వచ్చే 5 ఏళ్లలోబాహుదా నది నుంచి పెన్నానది వరకు  ఉన్న నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా చేస్తానని భరోసా ఇచ్చారు.

కోడి కత్తి పార్టీ అధినేత రోజుకో క్వాలిఫికేషన్ చెపుతాడన్నారు. జగన్ ని నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే వివరించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు  తీర్చటానికి 21 కార్పోరేషన్లు ఏర్పాటు చేశానని వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూసే బాధ్యత నాదే అని వెల్లడించారు చంద్రబాబు. రౌడీలను ఉక్కుపాదంతో అణిచి వేస్తానని అన్నారు.

జగన్ కు దొంగ లెక్కలు రాసుకోవటం తప్ప ఏమీ రాదని, మోడీని చూస్తే అతనికి భయం అని, కేసీఆర్ ను చూస్తే ఉచ్చపోసుకుంటాడని విమర్శించారు. పొరపాటున అతడ్ని గెలిపిస్తే మీ ఆస్తులు కూడా మీ పేరున ఉండవన్నారు చంద్రబాబు. ఇప్పటికే జగన్ పై 31కిపైగా కేసులు  ఉన్నాయని చంద్రబాబు వివరించారు. కార్యక్రమం మొత్తం కూడా చంద్రబాబు జగన్ పేరు ఎత్తకుండా.. కోడి కత్తి పార్టీ అధినేత అంటూ సంబోధిస్తూ మాట్లాడారు.