పరిటాల కుటుంబంలో విషాదం

  • Publish Date - December 22, 2019 / 05:43 AM IST

తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకుల కుటుంబాల్లో ఒక్కటి అయిన పరిటాల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దివంగత నేత పరిటాల రవి తండ్రి కామ్రేడ్ పరిటాల శ్రీరాములయ్య సోదరుడు పరిటాల గజ్జిలప్ప అనారోగ్యంతో మృతి చెందారు.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పరిటాల గజ్జిలప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పరిటాల గజ్జిలప్ప మృతితో పరిటాల కుటుంబ సభ్యులు, అభిమానులు విచారణ వ్యక్తం చేస్తున్నారు.

గజ్జిలప్ప చనిపోయిన విషయం తెలుసుకున్న జిల్లాకు చెందిన నేతలు, టీడీపీ ముఖ్యనేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పరిటాల గజ్జిలప్ప అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4:00గంటలకు వెంకటాపురం గ్రామంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు.