వరంగల్ క్వారీలో పేలుడు : ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలు 

  • Publish Date - September 26, 2019 / 07:04 AM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో పేలుడు సంఘటన కలకలం రేపింది. ఓ కంపెనీలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఉంది. రాంపూర్‌లో వజ్రాకు సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ పలువురు కార్మికులు పనిచేస్తుంటారు. సెప్టెంబర్ 26వ తేదీ గురువారం రోజువారీలాగానే పనికి వెళ్లారు.

ఒక్కసారిగా పేలుడు సంభవించింది. గాయాలపాలైన వారిని రోహిణి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమకు ఏం జరిగిందో తెలియదని మహిళా కార్మికురాలు తెలిపారు. తనకు గాయాలు కాగా..చెల్లి కాలు తీసివేశారని విలపిస్తూ చెప్పింది. బండలు కడిగే బ్రిక్స్ తయారవుతాయని వెల్లడించింది. గాయాలపాలైన వారిలో నాయినీ రజిత, నాయినీ స్వరూప, ప్రియాంకలున్నారు.