భూమి పట్టా చేయడం లేదంటూ : సజీవ సమాధికి యత్నం
పొలం భూమికి పట్టా చేయడం లేదంటూ ఓ రైతు తనను తానే సజీవ సమాధి చేసుకునేందుకు ప్రయత్నించాడు.
- veegam team
- Published On : October 1, 2019 / 03:26 PM IST
పొలం భూమికి పట్టా చేయడం లేదంటూ ఓ రైతు తనను తానే సజీవ సమాధి చేసుకునేందుకు ప్రయత్నించాడు.
పొలం భూమికి పట్టా చేయడం లేదంటూ ఓ రైతు తనను తానే సజీవ సమాధి చేసుకునేందుకు ప్రయత్నించాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో మేక సుధాకర్‌కు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తన భూమికి పట్టా ఇవ్వడంటూ ఎన్నిసార్లు తిరిగినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నాడు.
పట్టా బుక్ ఇవ్వకుండా రాజకీయ నాయకులు తమ పరపతి చూపిస్తున్నారని ఆందోళనకు దిగాడు. జిల్లా అధికారులు సహకరించి న్యాయం చేయాలని.. లేదంటే చావడానికైనా సిద్ధమని తెగేసి చెబుతున్నాడు. ప్రస్తుతానికి గ్రామ సర్పంచ్ చొరవతో తహశీల్దారు మాధవి రంగంలోకి దిగింది. రేపు గ్రామానికి వచ్చి సర్వే చేసి న్యాయం చేస్తానని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
