అందరికీ ఒకటే రూల్ : ప్రతిపక్షాల ఆరోపణలు ఖండిస్తున్నాం – గుంటూరు ఐజీ వినీత్

  • Publish Date - September 7, 2019 / 07:58 AM IST

పల్నాడులో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు ఐజీ వినీత్ బ్రిజ్ లాల్. వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ప్రచారం జరుగుతోందని..పోలీసులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. రూల్ ఆఫ్ లా ప్రకారమే పని చేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 07వ తేదీ శనివారం కోస్తా ఐజీ వినీత్ బ్రిజ్ లాల్, గుంటూరు గ్రామీణ ఎస్పీ జయలక్ష్మీ, తదితర ఉన్నతాధికారులు పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని సూచించారు. వదంతులు ప్రచారం చేయవద్దన్నారు. ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి పోలీసులు సహకరించడం లేదని..ఏదైనా ఆధారం ఉంటే..తమకు చూపించాలని సూచించారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరికన్నా భయం ఉన్నా..ఏమైనా సమస్యలుంటే ధైర్యంగా పోలీసులకు కంప్లయింట్ చేయవచ్చన్నారు. పంచాయతీ ఎన్నికలు త్వరలో వస్తున్నాయని, భద్రత గురించి చర్చించడం జరిగిందన్నారు. 

2014 తర్వాత 4 హత్యలు జరిగాయని, అనంతరం మూడు నెలల నుంచి ఒక్క హత్య జరగలేదన్నారు. 324 కొన్ని ఇష్యూలు జరిగాయని..90 శాతం కేసుల్లో ఇప్పటికే ఛార్జీషీట్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. వదంతులు వ్యాపించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దన్నారు. పల్నాడులో ప్రశాంత వాతవరణం ఉందన్న ఆయన..పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల అనంతరం పలు ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార, ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. 
Read More : మంచి పనులు చేస్తే ఎందుకు ఓడించారు

ట్రెండింగ్ వార్తలు