మహా యజ్ఞం: ప్రజలు కోరుకుంటే అమరావతి పూర్తవుతుంది

  • Publish Date - April 7, 2019 / 04:19 AM IST

అమరావతిలో ఇటుక కూడా పడలేదన్న జగన్ వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు శివాజీ ‘నిజం’ పేరుతో స్పందించారు.. అమరావతి బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారని చెప్పిన శివాజీ అమరావతిలో పర్యటించి అక్కడ షూట్ చేసిన వీడియోలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. వరల్డ్ క్లాస్‌లో అమరావతి నిర్మాణం జరిగిందని అన్నారు. ఏపీలో మహా యజ్ఞంలా రాజధాని నిర్మాణం జరుగుతుందని, 40 టవర్లు నిర్మాణం విజయవంతంగా జరుగుతుందని చెప్పారు.

ప్రజలు కావాలనుకుంటే ఇది పూర్తవుతుందని, ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు శివాజీ పిలుపునిచ్చారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోకపోతే అమరావతి పూర్తికాకుండా వేరే ప్రాంతానికి వెళ్లిపోతుందని అన్నారు. అమరావతి నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని, కొందరు నాయకులు మాత్రం అవాస్తవాలను ప్రచారం చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. తన విజన్ ఏంటి చెప్పి ప్రజలకు దగ్గర కావాలి కానీ, అబద్దాలు ప్రచారం చేసుకుని కాదని శివాజీ అన్నారు.