హ్యుందాయ్ కారు చూడగానే లోగోలో ఒక స్టయిలిష్ పిక్చర్ ఆకట్టుకుంటుంది. ఆ లోగో అర్థం గురించి తరువాత చెప్పుకుందాం గానీ.. హ్యుందాయ్ కంపెనీ షోరూంలో ఉన్న ఓ ప్రత్యేక సెలబ్రిటీ గురించి ఇప్పుడు చెప్పుకుందాం..బ్రెజిల్ లోని హ్యుందాయ్ షోరూమ్ లో కష్టమర్లను ఆకర్షించటానికి ఓ కుక్కను సేల్స్ పర్సన్ గా పెట్టుకుంది. ఓ కుక్కను సేల్స్ పర్సన్ గా పెట్టుకోవటం ఓ విశేషమైతే..ఏదో పెద్ద జాతి కుక్క కాదు ఓ వీధి కుక్క ను సేల్స్ పర్సన్ గా పెట్టుకోవటం మరో విశేషం.
హ్యుందాయ్ షోరూంకు వెళ్లగానే ఆ కుక్క ‘రండి మా షోరూంలో మీకు నచ్చిన కారు కొనుక్కోండి’ అన్నట్టుగా..తోక ఊపుతూ, బౌబౌ అని తనదైన భాషలో కష్టమర్లను ఆకట్టుకుంటోంది.
ఆ కుక్కను హ్యుందాయ్ షోరూం నిర్వాహకులు దత్తత తీసుకున్నారు. ఆ కుక్కకి టక్సన్ ప్రైమ్ అని నామకరణం కూడా చేశారు. మెడలో ఓ ఐడీ కార్డు కూడా వేసి సేల్స్ పర్సన్ ఉద్యోగం ఇచ్చారు. హ్యుండాయ్ కంపెనీ తయారుచేసే ఓ కారు పేరు టక్సన్. ఆ పేరునే ఈ కుక్కకు పెట్టారు. ఆ కుక్కకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో 28 వేల వరకు అభిమానులున్నారు. షోరూంకు వచ్చిన కస్టమర్ల కార్లను చెక్ చేయడం, కస్టమర్లు షోరూంలోకి వెళ్లేటప్పుడు తోకాడించుకుంటూ వారిని సాదరంగా తొడ్కొని వెళ్లడం టక్సన్ ప్రైమ్ విధి. అంతేకాదు, షోరూం సిబ్బందికి నిర్వహించే సమావేశాల్లో ఇది కూడా పాల్గొంటుంది.
ఆ షోరూంకు వచ్చే కష్టమర్ల ప్రశంసలు అందుకుంటోంది టక్సన్. షోరూంకు వచ్చిన కస్టమర్ల కార్లను చెక్ చేస్తుంది. కష్టమర్లు షోరూంలోకి వెళ్లేటప్పుడు తోక ఆడించుకుంటూ వారిని సాదరంగా లోనికి తోలుకుని వెళ్లి కష్టమర్ల చుట్టూ తోకాడించుకుంటూ తిరుగతుంటుంది. ఇంత చేస్తున్న ఆ కుక్కకు సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 28 వేల వరకు ఫాలోవర్లు ఉన్నారు.
అవునూ హ్యూండాయ్ లోగో గురించి చెప్పాలి కదూ…హ్యూండాయి లోగోలో ఒక స్టయిలిష్ పిక్చర్ అర్థమేమిటంటే..ఇద్దరు మనుషులు కరచాలనం (షేక్ హ్యాండ్) చేస్తున్నట్టు అర్థం వచ్చే లోగో అది. ఇద్దరిలో ఒకరు కంపెనీకి చెందిన వ్యక్తి, మరొకరు హ్యాపీగా ఉండే కారు కొన్న కస్టమర్. ఇద్దరూ హ్యాండ్‌షేక్ చేస్తారు. ఇది నమ్మకానికి, సంతృప్తికి చిహ్నం అని అర్థం వచ్చేట్టు లోగో డిజైన్ చేశారు. ఈ లోగో వెహికిల్ గ్రిల్ మీద సిల్వర్ రంగులోనే కనిపిస్తుంది. అదన్నమాట హ్యూండాయ్ లోగోలోని అర్థం..పరమార్థం..