స్పీకర్‌ను కొడతారేమో అనేట్లుగా: టీడీపీపై జనసేన ఎమ్మెల్యే సీరియస్

  • Publish Date - January 22, 2020 / 09:53 AM IST

రాజధాని అమరావతిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఈ క్రమంలోనే జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానుల నిర్ణయానికి సపోర్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆయన అధికారికంగా ఆ పార్టీ కండువా కప్పుకోకపోయినా కూడా అనధికారికంగా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు.

అయితే జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. లేటెస్ట్‌గా వైసీపీకి వత్తాసు పలుకుతూ అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులపై విమర్శలు గుప్పించారు. ఒక ముఖ్యమైనటువంటి అంశంపై చర్చ జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్లు అల్లరి చెయ్యడం దారుణణం అని వ్యాఖ్యానించారు. తక్కువ మంది ఉన్నా ఎక్కువ అల్లరి చేస్తున్నారని టీడీపీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు.

స్పీకర్‌ను కొడతారేమో అనేంతలా భ్రమ కలిగించారని, టీడీపీ సభ్యులు ఆ రకంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని రాపాక విమర్శించారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాపాక స్పీకర్‌ని కోరారు. అంతకుముందు ఇదే విషయమై మాట్లాడిన రాపాక రాజధాని విషయంలో ఓటింగ్ జరిగితే వైసీపీ నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ ఓట్ వేస్తానని ప్రకటించారు.