ఓవైపు నామినేషన్‌ల హడావుడి.. దాదాపు అన్నీ పార్టీలు అభ్యర్ధులను ఖరారుచేసి రంగంలోకి దింపేసింది. జనసేన మాత్రం ఇంకా అభ్యర్ధులను విడతలవారీగా ప్రకటిస్తుంది. ఈ క్రమంలో ఆరవసారి అభ్యర్ధుల లిస్ట్‌ను విడుదల చేసిన జనసేన.. 16మంది అభ్యర్ధులకు అందులో అవకాశం కల్పించింది. ఇప్పటివరకు 32, 32, 16, 8, 16, ఇలా ఐదు విడతలు విడుదల చేయగా.. తాజా లిస్ట్‌లో 16మందికి చోటు ఇచ్చారు. జనసేన మొత్తం 140స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 25వ తేదీ నామినేషన్‌లకు చివరి రోజు కావడంతో మిగిలిన అభ్యర్ధులను ఎప్పుడు ప్రకటిస్తారు అనేది ఆసక్తికరంగా ఉంది.
జనసేన అభ్యర్ధుల ఆరవ లిస్ట్:
గుడివాడ – రఘునందన్ రావు
జగ్గయ్య పేట – ధరణికోట వెంకటరమణ
పొన్నూరు – బోని పార్వతి నాయుడు
గురజాల – చింతలపూడి శ్రీనివాస్
నంద్యాల – సజ్జల శ్రీధర్ రెడ్డి
మంత్రాలయం – బోయ లక్ష్మణ్
రాయదుర్గం – మంజునాథ గౌడ్
తాడిపత్రి – కదిరి శ్రీకాంత్ రెడ్డి
కళ్యాణదుర్గం – కరణం రాహుల్
రాప్తాడు – సాకె పవన్ కుమార్
హిందూపురం – ఆకుల ఉమేష్
పులివెందుల – తుపాకుల చంద్రశేఖర్
ఉదయగిరి – మారెళ్ల గురు ప్రసాద్
సూళ్లూరుపేట – ఉయ్యాల ప్రవీణ్
పీలేరు – బి. దినేష్
చంద్రగిరి – శెట్టి సురేంద్ర