సెప్టెంబరు 2 నుంచి కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు

  • Publish Date - September 1, 2019 / 01:37 PM IST

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక శ్రీ వరసిధ్ధి వినాయక స్వామి వారి ఆలయంలో  సెప్టెంబరు 2 , 2019, సోమవారం నుంచి 22 వ తేదీ వరకు 21 రోజుల పాటు   వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా 
2వ తేది సోమవారం  వినాయక చవితి,గ్రామోత్సవం
3వ తేది మంగళవారం ఉదయం ధ్వజారోహణం, రాత్రికి హంస వాహన సేవ
4వ తేది బుధవారంనెమలి వాహన సేవ
5వ తేది గురువారం మూషిక వాహన సేవ
6వ తేది శుక్రవారం ఉదయం చిన్నశేష వాహానం, రాత్రికి పెద్ద శేష వాహానం
7వ తేది శనివారం ఉదయం చిలుక హావాన సేవ, రాత్రికి వృషభ వాహన సేవ
8వ తేది ఆదివారం ఉదయం గజ వాహన సేవ
9వ తేది సోమవారం రధోత్సవం
10వ తేది మంగళవారం తిరుకళ్యాణం నిర్వహిస్తారు.
11వ తేది బుధవారం ధ్వజావరోహణం, వడయాత్తు ఉత్సవం ఏకాంత సేవలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సెప్టెంబరు 12  గురువారం నుంచి 22 వతేదీ ఆదివారం వరకు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయని దేవస్ధానం అధికారులు తెలిపారు.