కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ జయించిన సీఎం…బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి నుంచి సోమవారం(ఆగస్టు-10,2020) డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ఈ నెల 2న వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు సీఎం. చికిత్స అనంతరం తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావటం వల్ల యడియూరప్పను డిశ్చార్జి చేశారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే సీఎం యెడియూరప్ప తను కోలుకోవాలని కోరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
నా కోసం ప్రార్థించిన మీ అందరికి ధన్యవాదాలు. నేను ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాను. అలాగే ప్రస్తుతం ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటాను. మీ అందరి అప్యాయతలకు కృతజ్ఞుడిని. త్వరలోనే తిరిగి విధులు నిర్వహించాలని ఎదురు చూస్తున్నాను అని తెలిపారు.