కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బతో యావత్ ప్రపంచం స్థంభించి పోయింది. అన్నిరకాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయాయి. ప్రజలు చేతిలో ఉండే కొద్దిపాటి డబ్బుతో పొదుపుగా వాడుకుంటున్నారు. అదీలేక ఇల్లు, బంగారం తాకట్టుపెట్టే స్థాయికి చేరుకున్నారు. ఇది కేవలం సామాన్య మానవులకేకాదు..దేవుళ్లకు తప్పని స్థితి వచ్చినట్లుగా ఉంది.
కేరళలో కొలువుదీరిన అయ్యప్ప స్వామికి కూడా కరోనా దెబ్బ తప్పలేదు.అయ్యప్ప దేవాలయం ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ఆలయ ఆదాయం తగ్గిపోవడంతో సిబ్బంది జీతాలు ఇచ్చే పరిస్ధితి కూడా లేకుండాపోయింది. ఆఖరికి దేవాలయాల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో ఆలయలకు కానుకల రూపంలో వచ్చిన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడానికి సిద్ధం అయ్యారు.
ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో నడిచే 1,247 ఆలయాల్లో, సిబ్బంది జీతభత్యాలకు కష్టకాలం వచ్చింది. ఆదాయం నిలిచిపోయింది. కానీ ప్రతి నెల సిబ్బంది, ఆలయాల నిర్వహణకు రూ. 50 కోట్లు ఖర్చు తప్పటం లేదు.ఇప్పటి వరకు గతంలో వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేస్తూ వచ్చారు. ఇక ఆ పరిస్థితి లేకపోవడంతో బోర్డు రిజర్వు బ్యాంకును ఆశ్రయించింది. గోల్డ్ కాయిన్స్, ఆభరణాలను కలిపి దాదాపు 1000 కేజీల బంగారాన్ని కుదువ పెట్టడానికి సిద్ధమయింది.
భారతదేశంలోని తిరుమల శ్రీ వేంకటేశ్వర దేవాలయం..కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం..మహారాష్ట్రంలోని శ్రీ షిర్డీ సాయిబాబు దేవాలతో పాటు దేశంలో అధికంగా ఆదాయం గల దేవాలయాల్లో అయ్యప్ప్ దేవాలయం కూడా ఒకటి. అటువంటి దేవాలయానికి ఇప్పుడు కష్టకాలం వచ్చింది. దేవాయలం నిర్వహణకు..సిబ్బంది జీతాలకు డబ్బులు లేకపోవటంతో అయ్యప్ప స్వామి బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. శబరిమల ఆలయం సంవత్సరానికి 30 మిలియన్ల మంది భక్తులు వస్తుంటారు. దీంతో దేవాలయం ఆదాయం కూడా భారీగానే ఉంటుంది.