జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సంధర్భంగా జనసేన నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు మనందరం ఒకసారి కడప జిల్లా పులివెందులలో పర్యటనకి వెళ్దాం అని అన్నారు పవన్ కళ్యాణ్. కేవలం రాజకీయ లబ్ది కోసం కాకుండా యురేనియం తవ్వకాలు వల్ల అక్కడ జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయి. అవి ప్రజల దృష్టికి తీసుకొచ్చి వాళ్లకి ఎలా న్యాయం చెయ్యాలో చూద్దాం అని కోరారు పవన్ కళ్యాణ్.
అవినీతి పైన రాజీ లేని పోరాటం అంటే నవ్వుతారు అని నాకు తెలుసు. ఎప్పటికీ గెలవని పోరాటం ఇది అని తెలుసు. కానీ ప్రయత్నం చేయాలి కదా? అని అన్నారు పవన్ కళ్యాణ్. ఇసుక మీద గవర్నర్ కి ఇచ్చిన 18 పాయింట్లలో ఒకటి ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో వారి పైన గూండా చట్టం, జైలు శిక్ష అని పెట్టాం దానినే నిన్న ప్రభుత్వం ఆమోదించింది అని చెప్పారు పవన్ కళ్యాణ్.
ఇదే సమయంలో మట్టిలో కలిసిపోతారు అనే మాట నేను ఆవేశంలో అనలేదు అని, తెలుగు భాషని మీరు అగౌరవంగా చూస్తే మట్టిలో కలిసిపోతారు. మళ్లీ చెప్తున్నా.. మట్టిలో కలిసిపోతారు అని హెచ్చరించారు. భాషల్ని గౌరవించే సంప్రదాయం జనసేన పార్టీది అని ఇదే విషయాన్ని బలంగా వినిపిస్తున్నట్లు చెప్పారు.
బొత్స గారు తెలుగు భాష గురించి మట్టిలో కలిసిపోతారు అని అన్నాను అని తెగ బాధ పడిపోయారు అని, ఆయన్ని నేను అడుగుతున్నా విడిపోయిన వాళ్ల జీవితాలని రాజకీయాల్లోకి ఎలా తీసుకుని వస్తారు ఇంగిత జ్ఞానం లేనిది ముందు మీ నాయకుడికి. ఆయనకు చెప్పండి ఎలా మాట్లాడాలో. ఇంగిత జ్ఞానం అంటే మీ భాషలో Common sense అని అన్నారు.