హెల్ప్ హెల్ప్ అంటూ అరిచిన అమ్మాయి: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన రోజే శ్రీకాకుళంలో..

  • Publish Date - December 7, 2019 / 04:54 AM IST

దేశంలో ఉన్న చట్టాలు ప్రస్తుతానికైతే నిందితులకు భయం పుట్టించడం లేదు. వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్న భారత న్యాయ మౌలిక సూత్రం నేరస్తులను కాపాడుతూనే ఉంది. ఎంతోమంది నేరస్థులు తప్పించుకోవడానికి కారణం అవుతోంది. ఈ క్రమంలో అప్పుడప్పడు పోలీసులే న్యాయం చేయాల్సి వస్తోంది.

అయితే ఎన్ని ఎన్‌కౌంటర్‌లు చేసినా, ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా మృగాడు అనే వాడు మళ్లీ.. మళ్లీ తన ప్రతాపాన్ని సమాజంపై రుద్దుతూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటన ఇటువంటి వ్యక్తులు ఏమి చేసినా మారరు అనే విషయాన్ని చెబుతుంది. 

వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సిర్లాo సెంటర్ వద్ద 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిని టాటా మేజిక్ వ్యాన్‌లో డ్రాప్ చేస్తానంటూ ఎక్కించుకుని ఓ వ్యాన్ డ్రైవర్ దారి మళ్ళించారు. మద్యం తాగి ఉన్న డ్రైవర్.. డ్రాప్ చేస్తానంటూ ఎక్కించుకుని దారి మళ్లించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అమ్మాయి హెల్ప్..హెల్ప్ అంటూ కేకలు వేయడంతో అది గమనించి కారులో వెళ్తున్న కొందరు వెంబడించి వాడిని పట్టుకొన్నారు. అనంతరం చితక్కొట్టి పోలీసులకు అప్పజెప్పారు. దిశ ఘటనలొ లారీ డ్రైవర్ చేసినట్లే ప్రేరణతో ఇతను చేసినట్లు చెబుతున్నారు స్థానికులు.