జనవరి 1 వ తేదీ నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. జనవరిలో 5 వేల హెల్త్ సెంటర్లకు పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు.
జనవరి 1 వ తేదీ నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. జనవరిలో 5 వేల హెల్త్ సెంటర్లకు పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. శుక్రవారం (డిసెంబర్ 20, 2019) నాడు-నేడు కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. సబ్ సెంటర్లు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, కొత్తగా నిర్మంచే కిడ్నీ, క్యాన్సర్ ఆస్పత్రులకు నిధుల సమీకరణ, ఖర్చుపై చర్చించారు. నాడు-నేడు కోసం డిసెంబర్, జనవరి, మార్చిలో మూడు విడతల్లో టెంటర్లు నిర్వహించాలని నిర్ణయం తీసున్నట్లు తెలిపారు.
తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హిమోఫిలియా, డయాలసిస్ రోగులకు రూ.10 వేల చొప్పున పెన్షన్లు ఇస్తామని చెప్పారు. డయాలసిస్ రోగులకు రూ.10వేల చొప్పున పెన్షన్లు ఇస్తామని చెప్పారు. బోదకాలు, వీల్ చైర్లకు పరిమితిమైనవారు, తీవ్ర పక్షవాతంతో బాధపడుతున్నవారికి జనవరి నుంచి పెన్షన్లు అందజేస్తామని చెప్పారు. కుష్టువ్యాధితో బాధపడుతున్న వారికి నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆస్పత్రుల్లోని పారిశుద్ధ్య కార్మికుల జీతాలు రూ.8 వేల నుంచి 16 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు.
మార్చి 2020 నాటికల్లా 1060 కొత్త 104, 108 అంబులెన్స్ లను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. మే నెల చివరినాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలో 2 వేల రోగాలకు ఆరోగ్యశ్రీ, పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తామని చెప్పారు. మిగిలిన 12 జిల్లాల్లో కూడా 1200 రోగాలకు ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామని తెలిపారు. ఇందులో క్యాన్సర్ రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించాలన్నారు.