క్షుద్రపూజల కలకలం : ఇంటి ఎదుట కోడిగుడ్లు, నిమ్మకాయలు, ఎముకలు
విజయనగరం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. శృంగవరపుకోటలోని బీకే రావు కాలనీలోని ఈశ్వరరావు అనే వ్యక్తి ఇంటి ఎదుట అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గు వేశారు.
- veegam team
- Published On : January 29, 2020 / 08:30 AM IST
విజయనగరం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. శృంగవరపుకోటలోని బీకే రావు కాలనీలోని ఈశ్వరరావు అనే వ్యక్తి ఇంటి ఎదుట అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గు వేశారు.
విజయనగరం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. శృంగవరపుకోటలోని బీకే రావు కాలనీలోని ఈశ్వరరావు అనే వ్యక్తి ఇంటి ఎదుట అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గు వేశారు. దానిపై కోడిగుడ్లు, నిమ్మకాయలతోపాటు ఎముకలు కూడా పెట్టారు. పసుపు, కుంకుమ చల్లి పూజలు చేశారు.
తెల్లవారాక ఇంటి తలుపు తెరిచిన ఆ ఇంట్లోని వ్యక్తులు… ఈ దృశ్యాలను చూసి వణికిపోయారు. ఎవరు ఈ పనిచేశారో తెలియదంటూనే… భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈశ్వరరావు కుటుంబీకులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.