యునెస్కో గుర్తింపు పొందిన దీవులు: ’కరోనా పాజిటివ్‘ ఉన్నవారికే ఎంట్రీ..

  • Publish Date - September 1, 2020 / 05:03 PM IST

ప్రస్తుతం ఏ యాత్రకు వెళ్లాలన్నా..కరోనా టెస్ట్ లు కంపల్సరీ అయ్యాయి. కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే ఎంట్రీ. లేదంటే నో ఎంట్రీ. కానీ బ్రెజిల్ లోని పెర్నంబుకో స్టేట్ లో ఉన్న కొన్ని దీవులకు వెళ్లాలంటే ‘ఓన్లీ కరోనా పాజిటివ్’’ఉన్నవారికి మాత్రమే ఎంట్రీ అంటోంది. అదేంటీ నెగిటివ్ ఉన్నవారికే ఎంట్రీ కాకుండా పాజిటివ్ ఉంటేనే ఎంట్రీ ఏంటీ..విచిత్రంగా ఉందే అనుకోవచ్చు..అసలు కారణమేంటంటే..

పెర్నంబుకో స్టేట్ లో ఫెర్నాండో డి నొరాన్హా అనే దీవుల సమూహం ఉంది. ఈ దీవులకు వరల్డ్ బెస్ట్ బీచ్ అవార్డు కూడా వచ్చిందీ అంటే ఈ దీవుల్లో అందం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బంగారు వర్ణంలో మెరిసిపోయే ఇసుక..డాల్ఫిన్ల కనువిందు..21 అగ్నిపర్వత ద్వీపాల సమూహం వంటి ప్రత్యేకతలు కలిగిన ఈ ఫెర్నాండో డి నోరాన్హా దీవుల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 2001 లో ప్రకటించింది. ఈ దీవులకు ప్రతీ ఏటా టూరిస్టులు లక్షల సంఖ్యలో వస్తుంటారు. కానీ కరోనా మహమ్మారి పుణ్యమాని..టూరిస్టులు లేక ఈ దీవులు బోసిపోయాయి. అస్సలు మనుష సంచారమే లేకుండా పోయింది. కానీ.. వచ్చే వారం నుంచి ఈ ఫెర్నాండో డి నొరాన్హా దీవులను తిరిగి ప్రారంభించాలని అధికార వర్గాలు నిర్ణయించాయి.

అయితే..కానీ అదేం విచిత్రమో కానీ, కరోనా పాజిటివ్ ఉన్నవాళ్లకే తమ దీవిలో ప్రవేశం ఉంటుందని ఓ నిబంధన విధించారు అధికారులు. కరోనా పాజిటివ్ వచ్చిందని మెడికల్ రిపోర్టు కంపల్సరిగా సమర్పించాల్సి ఉంటుంది. అది కూడా పీసీఆర్ టెస్టులో వచ్చిన ఫలితాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. అంతేకాదు, 20 రోజులలోపు పరీక్ష చేయించుకుని ఉండాలట. ఇన్ని నిబంధనలు విధించిన అధికారులు మాత్రం కరోనా పాజిటివ్ వ్యక్తులనే దీవులకు ఎందుకు ఆహ్వానిస్తున్నారో వెల్లడించలేదు.

కాగా..2019తో ఈ దీవులకు 10 లక్షలకు పైగానే టూరిస్టులు సందర్శించారని టూరిజం శాఖ తెలిపింది. వారిలో 90 శాతం మంది బ్రెజిల్ వాసులే. ఇదిలా ఉండగా..ప్రస్తుతం బ్రెజిల్ ‌లో ఆగస్టు 31నాటికి 48వేల 590 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల నుంచి టూరిస్టులు ఎలాగూ రారు..బ్రెజిల్ లో నెగిటివ్ ఉన్నవారు ఎలాగూ బైటికిరారు..ఇక కరోనా పాజిటివ్ కేసులు కూడా భారీగానే ఉన్వానాయి కాబట్టి వారైనా వస్తారని ఇలా ‘కరోనా పాటిజివ్ ఉన్నవారికి మాత్రమే ఎంట్రీ అని నిబంధన పెట్టి ఉంటారని అనుకోవచ్చు..