అనంతపురంలో పోటీ ఎందుకు చేయలేదో చెప్పిన పవన్ కళ్యాణ్

  • Publish Date - March 29, 2019 / 02:22 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి రాజుకున్న నేప‌థ్యంలో ప్ర‌తి పార్టీ కూడా వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తుంది. అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు అనంతపురం నుంచి పోటీ చేయలేదు అనే విషయాన్ని వివరించారు.
Read Also : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రివ్యూ

తొలుత ప్రకటించినట్లుగా అనంతపురం నుండి పోటీ చేద్దామని అనుకున్నానని, అయితే జనసేన నాయకులు స్థైర్యం ఇవ్వలేదని, తాను పోటీ చేస్తే ఓడిపోతాననే ఉద్దేశంతోనే అనంతపురం నుంచి పోటీ చేయలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

తనను గెలిపిస్తానన్న భరోసా ఇక్కడి ప్రజలు ఇవ్వలేదని అన్నారు. అందుకే నేను పోటీ చేయకుండా టీసీ వరుణ్‌కు అనంతపురం టిక్కెట్ ఇచ్చానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే ఇక్కడి వ్యక్తులతో జనసైనికులు పోరాడాలని, ధైర్యంలేని వాళ్లు జనసేనలో ఉండొద్దని, భయపడే నాయకులు తమకు అవసరం లేదని సూచించారు. భయపడితే మార్పు రాదని అన్నారు.

Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష