ఇది కదా భారతీయ భాషల గొప్పదనం: పవన్ కళ్యాణ్

  • Publish Date - November 24, 2019 / 02:05 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష పరిరక్షణ పేరుతో పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకుని రావాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న  జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దీనిపై ఇప్పటికే మన నుడి, మన నది పేరుతో ఉద్యమం ప్రారంభించారు. 

తెలుగు భాషా ప్రాధాన్యాన్ని తమదైన శైలిలో వివరిస్తూ.. ట్వీట్లు చేస్తున్న పవన్ కళ్యాణ్.. తెలుగులోనే ట్వీట్లు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. లేటెస్ట్‌గా తెలుగులో చెప్పినప్పుడే ఏ విషయమైనా ఈజీగా అర్థమవుతుంది అంటూ చెప్పిన ఆయన.. సంస్కృత స్లోకాలు, స్తోత్రాలను ఇంగ్లీష్‌లో చెబితే అర్థమవుతుందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ వీడియో పెట్టిన పవన్ కళ్యాణ్.. ఆ వీడియోని చూడాలని జగన్‌కు సూచించారు.

ఇదే సమయంలో తెలుగు భాషకు మూలం దేవ భాషగా పిలువబడే సంస్కృతం అని, ద్వాపర యుగంలో లిఖితమైన భగవద్గీత గాని, శంకరాచార్య విరచితం శివాష్టకం గాని భక్తితోపాటు సంస్కృత భాష యొక్క వైశిష్ట్యాన్ని తెలియచేస్తాయని చెప్పారు. మనోవికాసానికైనా, మత ప్రచారానికైనా మనకు తెలిసిన భాషలో చెప్పినప్పుడే సామాన్యులకు సులభంగా అర్ధం అవుతుంది.  అదే మన భారతీయ భాషల గొప్పదనం.. మన భాషను మన సంస్కృతిని మనం సంరక్షించుకోవాలి, గౌరవించుకోవాలి అని అన్నారు పవన్ కళ్యాణ్.