తొలిసారిగా భారతదేశ చరిత్ర‌లో చట్టసభ సభ్యుడుగా ఆఫ్రికన్ సంతతి వ్యక్తి నామినేట్

  • Publish Date - July 25, 2020 / 11:37 AM IST

భారత్‌ చట్టసభలో తొలిసారిగా ఓ ఆఫ్రికన్ సంతతి వ్యక్తి నామినేట్అయ్యారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఓ ఆఫ్రికన్ సంతతికి చెందిన వ్యక్తికి చట్టసభను నామినేట్ అవ్వటం చాలా చాలా విశేషమని పలువురు రాజకీయ ప్రముఖులు అంటున్నారు. ఆయన పేరు ‘శాంతారాం’. సాధారణంగా మన దేశంలో గవర్నర్లు, రాష్ర్టపతి అసెంబ్లీలకు, పార్లమెంటుకు నామినేట్ సభ్యులుగా అవకాశాలు దక్కుతుంటాయి. పలురంగాల్లో ప్రతిభ కలిగిన ప్రముఖులకు ఈ సీట్లు దక్కుతుంటారు. ప్రముఖులతో పాటు ఆంగ్లో ఇండియన్లకు కూడా సీట్లు నామినేట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

కొందరు విదేశీయులుగా అంటే భారత్ లో స్థిరపడిన విదేశీయులకు కూడా ఇవి నామినేటెడ్ పదవులు దక్కుతుంటాయి. అలా విదేకనిపించినా వారికి భారతదేశంతో అవినాభావ సంబంధం ఉంది. వారు కూడా భారతీయులే. తాజాగా ఈ బహుళత్వ సంస్కృతిలో మరి కొత్త అధ్యాయం చోటుచేసుకుంది. దేశచరిత్రలోనే తొలిసారిగా ఆఫ్రికన్ సంతతికి చెందిన వ్యక్తి చట్టసభకు నామినేట్ అయ్యారు శాంతారాం.

ఆఫ్రికన్ సిద్ది సంతతికి చెందిన శాంతారాం బుండా సిద్దిని కర్ణాటక శాసన మండలికి గవర్నర్ వజూభాయ్ వాలా నామినేట్ చేశారు. ఆరెస్సెస్‌కు చెందిన గిరిజన సేవాసంఘం వనవాసి కల్యాణ్ ఆశ్రమ్ కు శాంతారాం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన శాంతారాం.. సిద్ధి సామాజిక వర్గంలో తొలి గ్రాడ్యయేట్ కూడా.

కర్ణాటక శాసన మండలికి గవర్నర్ వజూభాయ్ వాలా నామినేట్ చేసిన సందర్భంగా శాంతారాం మాట్లాడుతూ..‘మా మూలాలు మొజాంబిక్, కెన్యాలో ఉన్నాయి. పోర్చుగీసు వ్యాపారులు మమ్మల్ని బానిసలుగా ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్లు వెళ్లిపోయాక పశ్చిమ కనుమల్లోని దట్టమైన అడవుల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాం. మావాళ్లు ముంబై, గోవా, కర్ణాటక పశ్చిమ కనుల్లో మాత్రమే కనిపిస్తారు’ అని తెలిపారు. కాగా.. సిద్ది ప్రజలు కొంకణి, మరాఠీ కలగలిపిన భాష మాట్లాడతారు.