తప్పిపోయిన జల్లికట్టు ఎద్దుల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లిన యువకులను చిరుత పులులు వెంటపడి తరిమాయి. ఒకటీ రెండూ కాదు ఏకంగా ఆరు చిరుతలు వారిని తమిరికొట్టాయి. దీంతో వారు చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా అయ్యింది. బతికి బైటపడిన ఈ ఘటన తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
తిరుపత్తూర్ జిల్లా మదనాంజేరి ప్రాంతానికి చెందిన సెల్వం అనే రైతు 10 జల్లికట్టు ఎద్దులను పెంచుతున్నాడు. వాటిని చాలా శ్రద్ధగా..ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ 10 ఎద్దుల్లో నాలుగు ఎద్దులు పశువు పాక నుంచి తప్పించుకున్నాయి. దీంతో సెల్వం తన ఎద్దుల కోసం తీవ్రంగా గాలింపు ప్రారంభించాడు. తెలిసినవారిని అడిగాడు..ఎద్దుల కోసం ఒకటే వెతుకుతుండగా కొంతమంది తప్పిపోయిన ఎద్దులు ఏపీలోని అరంగల్ దుర్గం అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న సుట్టగుంటలో ఉన్నాయని చెప్పారు. దీంతో ఇంకేమీ ఆలోచించకుండా సెల్వం 20 మంది యువకుల్ని పోగేసి వారితో పాటు ఎద్దుల కోసం బయలుదేరారు.
https://10tv.in/anna-hazare-rejects-delhi-bjp-request/
అలా పెద్దూరు వెళ్లే రహదారిలో మరత్తుపారైలోని అటవీ ప్రాంతానికి చేరుకోగానే ఆరు చిరుత పులులు వారి వెంటపడ్డాయి. దీంతో చేసేది లేక ఆ యువకులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలోదారిలో పరుగులు తీశారు. అనంతరం అంబూరు అటవీశాఖ అధికారులను కలిసి జరిగింది చెప్పారు. దయచేసిన తమ ఎద్దులను తమకు వెతికిపెట్టి అప్పగించమని కోరారు. దీనికి అటవీఅధికారులు మాట్లాడుతూ..ఆంధ్రా నుంచి కొన్ని చిరుత పులులు తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించాయని, అవి ఆ ప్రాంతంలోని జంతువులను వేటాడుతున్నాయని అటవీశాఖ అదికారులు తెలిపారు.
మదనాంజేరి నుంచి తప్పించుకుపోయిన జల్లికట్టు ఎద్దులను కూడా ఆ చిరుతలు హతమార్చి ఉండొచ్చని, ప్రజలు ఆ ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఇక తప్పిపోయిన ఎద్దుల కోసం ఆ ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఒకవేళ ఆ ఎద్దులు బతికి ఉంటే ఎప్పటికైనా తిరిగి రావచ్చనీ..మీరు మాత్రం అటువైపుగా వెళ్లవద్దని మరోసారి హెచ్చరించారు.
కాగా తమిళనాడులో జల్లికట్టు క్రీడ ఎంత ఫేమస్సో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ జల్లికట్టులో పొల్గొనందుకు రైతులు ప్రత్యేకించి ఎద్దులను పెంచుతారు. వాటిని ప్రత్యేక దాణాలతో చాలా శ్రద్ధగా పెంచుతారు. అటువంటి జల్లికట్టు ఎద్దులను జల్లికట్టులోపోటీ పెడతారు.ఈ జల్లికట్టు క్రీడను వీక్షించటానికి స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు తరలివస్తారు. చాలామంది జల్లికట్టులో పాల్గొంటారు.