హారన్ కొడితే నరికేస్తారు..ఫోన్ మాట్లాడితే దాడి చేస్తారు : సైకో బ్రదర్స్ ను కాల్చిపారేసిన ఖాకీలు

  • Publish Date - July 17, 2020 / 04:37 PM IST

Madhya Pradesh Psycho Killers Brothers six Murders : హారన్ కొడితే వెంటాడి వేటాడి చంపేస్తారు..సెల్ ఫోన్ మాట్లాడటం వారి కంట పడిందంటే చాలు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేస్తారు ఆ అన్నదమ్ములు. చూడటానికి వాళ్లు పిచ్చివాళ్లలా కనిపిస్తారు.కానీ కిరాతకులు. నరరూప రాక్షసులు. వారి కిరాతకానికి ఓ కుటుంబమే బలైపోయింంది. కుటుంబంలోని చిన్నారులతో సహా ఆరుగురిని అతి కిరాతకంగా చంపేశారు హాలీవుడ్ సినిమాల్లోని సైకోల్లాంటి మధ్యప్రదేశ్ లోని ఆ అన్నదమ్ములు.

వివారల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ లోని మాండ్లా జిల్లాలోని ఓ మనేరి అనే ఓ చిన్న గ్రామంలో బుధవారం (జులై 15,2020)న ఆరుగురిని అతి కిరాతకంగా చంపేసిన ఘటన స్థానికులను భయపెట్టింది. పోలీసుల్ని కూడా విస్మయానికి గురిచేసింది.

వివారల్లోకి వెళితే..మండ్లా జిల్లా బిజాదండి ఏరియా మానేరి గ్రామానికి చెందిన హరీష్ సోని, అతని తమ్ముడు సంతోష్ సోనీ సైకోల్లా ప్రవర్తించేవారు. వారి ఇంటి ముందు నుంచి వెళ్తూ ఎవరైనా హారన్ కొడితే గొడ్డలి పట్టుకుని వెంబడించి మరీ నరికేసేవారు. ఎవరైనా ఫోన్ మాట్లాడుతూ వారి కంటిలో పడితే చాలు వారికి పిచ్చెక్కిపోతుంది. మారణాయుధాలతో దాడికి తెగబడతారు. సైకోలుగా మారిన అన్నదమ్ములు ఓ కుటుంబంతో గొడవపడి చిన్నారులని కూడా చూడకుండా మొత్తం ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురిని అతి దారుణంగా హత్య చేశారు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లారు. ఆ సైకో బ్రదర్స్ పోలీసులుపై ఎదురుదాడికి దిగారు. గొడ్డలి, కత్తులతో పాటు కారం డబ్బాలతో పోలీసులపైకి దాడికి దిగబోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు తమ కళ్లలో కారంకొట్టి మారణాయుధాలతో దాడి చేయటానికి యత్నింటంతో ఖాకీలు వాళ్లిద్దరినీ కాల్చిపారేశారు.

పోలీసులు కాల్పుల్లో ఒకరు బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా..మరొకడు పారిపోయేందుకు యత్నించటంతో అతడిని కూడా కాల్చిపారేశారు. ఈ దారుణ ఘటనపై అధికార పక్షంపై విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.