తెలంగాణలో మరో వింత..ఒంటికన్నుతో పుట్టిన శిశువు

  • Publish Date - August 8, 2020 / 06:59 PM IST

కొన్ని వారాల క్రితం మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో ఓ శిశువుకు పుట్టుకతోనే నోట్లో దంతాలతో పుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంచిర్యాలలో మరో వింత శిశువు జన్మించింది. ఒకే కన్నుతో పుట్టింది. అది చూసిన ప్రసవం చేసిన అంబులెన్స్ సిబ్బంది ఆశ్చర్యపోయారు.

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన శంకర్ ప్రియాంక దంపతులకు ఒకే కంటితో బాబు పుట్టాడు. ప్రియాంకకు పురిటి నొప్పులు రావడంతో 108లో లింగన్నపేట నుంచి చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తున్న సమయంలో దారిలోనే ప్రియాంక ప్రసవించింది. అంబులెన్స్ సిబ్బంది పురుడు పోశారు. పుట్టింది మగబిడ్డ అని చెప్పటంతో ఆనందపడ్డారు. కానీ ఆ బిడ్డకు ఒక్కకన్నే బాధపడ్డారు. కానీ పుట్టిన కాసేపటికే ఒంటికన్నుతో పుట్టిన బిడ్డ చనిపోయింది.

తమకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఆ కన్నవారికి ఎక్కువ సేపు నిలువలేదని ఆ తల్లి దుంఖపడింది.ఆ వింత బాబును చూడటానికి స్థానికులు ఆసక్తి చూపారు.కానీ అసలే బాధలో ఉన్న తమను ఇంకా ఇబ్బంది పెడతున్నారని ఆ బిడ్డను వారు ఖననం చేశారు.