చంద్రబాబు ముందే కార్యకర్తపై దాడి
క్రమశిక్షణకు మారుపేరుగా టీడీపీని చెప్పుకుంటారు ఆ పార్టీ నేతలు. టీడీపీ నేతలు, కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో ఉంటారని పలుమార్లు చంద్రబాబే స్వయంగా చెప్పుకుని గర్వంగా ఫీల్
- veegam team
- Published On : November 27, 2019 / 07:12 AM IST
క్రమశిక్షణకు మారుపేరుగా టీడీపీని చెప్పుకుంటారు ఆ పార్టీ నేతలు. టీడీపీ నేతలు, కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో ఉంటారని పలుమార్లు చంద్రబాబే స్వయంగా చెప్పుకుని గర్వంగా ఫీల్
క్రమశిక్షణకు మారుపేరుగా టీడీపీని చెప్పుకుంటారు ఆ పార్టీ నేతలు. టీడీపీ నేతలు, కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో ఉంటారని పలుమార్లు చంద్రబాబే స్వయంగా చెప్పుకుని గర్వంగా ఫీల్ అయ్యారు. అలాంటిది.. తమ్ముళ్లు దారి తప్పారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. దాడి చేసుకున్నారు. ఏకంగా చంద్రబాబు ముందే తన్నులాటకు దిగారు.
కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల తన్నుకున్నారు. చంద్రబాబు సమక్షంలోనే బాహాబహికి దిగారు. కడప నియోజకవర్గ టీడీపీ సమీక్ష సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. దళిత కార్యకర్తలు తమ సమస్యలను చంద్రబాబుకి చెప్పుకుంటున్నారు. సుబ్బయ్య అనే కార్యకర్త టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపై తన అసంతృప్తిని అధినేత ముందు వెళ్లగక్కారు. అంతే అక్కడే ఉన్న శ్రీనివాసులురెడ్డి అనుచరులకు కోపం వచ్చింది. సుబ్బయ్యపై దాడి చేశారు. చంద్రబాబు ముందే సుబ్బయ్యని తీవ్రంగా కొట్టారు. చంద్రబాబు వారించినా లాభం లేకుండా పోయింది.
దళితులు అయినందుకే తమను అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని.. ఇప్పుడు చంద్రబాబు ముందే దాడి చేశారని బాధితుడు వాపోయాడు. అధినేత ముందే కార్యకర్తలపై దాడి జరగడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. దీన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు.
