ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని అసెంబ్లీకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు
ఉల్లి ధరలపై టీడీపీ ఎమ్మెల్యేల నిరసన తెలిపారు. ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని నిరసన వ్యక్తం చేశారు.
- veegam team
- Published On : December 9, 2019 / 04:59 AM IST
ఉల్లి ధరలపై టీడీపీ ఎమ్మెల్యేల నిరసన తెలిపారు. ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఉల్లి ధరలపై టీడీపీ ఎమ్మెల్యేల నిరసన తెలిపారు. ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమేనని చంద్రబాబు చూపారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని అసెంబ్లీ సమావేశాలు హాజరయ్యేందుకు వచ్చారు. అయితే ఉల్లిపాయలతో అసెంబ్లీలోకి రావొద్దని టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబుతోపాటు ఇతర నేతలను పోలీసులు గేట్ దగ్గరే ఆపేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం ఉల్లిధరలను నియంత్రించలేకపోతుందని విమర్శించారు. టీడీపీ హయాంలో నిత్యావసర ధరలు పెరుగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సబ్సిడీపై తక్కువ ధరకే ఉల్లి అందించామని గుర్తు చేశారు. ధరలు దిగివచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
