పులివెందుల కూడా మాదే : అధికారం మళ్లీ టీడీపీదే

  • Publish Date - February 16, 2019 / 09:56 AM IST

అమరావతి : రానున్న సార్వత్రికి ఎన్నికల్లో గెలుపు తమదేనంటు ఏపీ మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు. విజయవాడలో భవనీపురం వాటర్ వర్క్స్ దగ్గర నిర్వహించిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతు..అన్ని స్థానాలకు దక్కించుకుంటామని..ఈసారి పులివెందుల విజయం కూడా తమదేనని జోస్యం చెప్పారు. ఏపీలోని 175 నియోజకవర్గాలకు పెన్షన్..రైతన్నల రుణమాఫీలు చేశామనీ..డ్వాక్రా మహిళలకు ఎంతో చేశామని కొత్తగా పసుపు కుంకుమ పథకం కింద ప్రతీ మహిళకు రూ.10 వేలు ఇచ్చామని ప్రజల కోసం ఇన్ని చేస్తున్న టీడీపీకే ప్రజలు మరోసారి పట్టం కడతాని చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని నారా లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు. అన్ని నియోజకవర్గాలకు తాగునీరు సాగునీరు అందజేస్తుమన్నారు. 
 

పట్టిసీమ ప్రాజెక్టు దండగ అని చెప్పిన ఏకైన వ్యక్తి జగనేనని..ఏపీ, తెలంగాణల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనీ..లోకేశ్ ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు చెందిన పులివెందుల నియోజకవర్గంలో కూడా టీడీపీనే విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని..సీమకు నీళ్లు ఇచ్చే పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించిన జగన్ ను ప్రజలు నిలదీయాలని లోకేశ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.