గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి లో పోలింగ్ ముగిసే సమయంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. పోలింగ్ ముగిసే సమయానికి సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ బూతుకు చేరుకుంటున్న ఓటర్లను తమ పార్టీకే ఓటు వేయమని అడిగే క్రమంలో, రెండు పార్టీల నాయకులకు మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు విచక్షణా రహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. దాడికి పాల్పడిన వారిని పోలీసు స్టేషన్ కు తరలించారు.